Hanuman Chalisa Row: మ‌హారాష్ట్ర సీఎంకు `హ‌నుమాన్ చాలీసా` ర‌గ‌డ‌

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే , మ‌హారాష్ట్ర నవ‌నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక‌రే మ‌ధ్య `హిందూ`యుద్ధం న‌డుస్తోంది.

  • Written By:
  • Updated On - April 23, 2022 / 01:52 PM IST

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే , మ‌హారాష్ట్ర నవ‌నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక‌రే మ‌ధ్య `హిందూ`యుద్ధం న‌డుస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలియ‌చేస్తూ హ‌నుమాన్ చాలీసాను సీఎం ఉద్ద‌వ్ ఇంటి ఎదుట పాడాల‌ని ఎంఎన్ఎస్ నిర్ణ‌యించింది. ప్ర‌తిగా అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా నివాసం వెలుపల శివసేన కార్యకర్తలు శనివారం నిరసనకు దిగారు. ఎంఎన్ ఎస్ నేత‌లు రాకుండా అడ్డుకోవ‌డానికి సీఎం ఇళ్లు మాతోశ్రీ వ‌ద్ద శివ‌సేన క్యాడ‌ర్ సిద్ధం అయింది. దీంతో శాంతిభద్రతలు తలెత్తకుండా సీఎం నివాసం దగ్గర భద్రతను పెంచారు. ముంబైలోని ‘మాతోశ్రీ’ వెలుపల శివసేన నాయకుడు కిషోరి పెడ్నేకర్ ఎంఎన్ఎస్ లీడ‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చారు.

ముంబై పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యొక్క సెక్షన్ 149 కింద నోటీసును శుక్ర‌వారం అందజేసారు. “హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించటం ఉద్ధవ్ ఠాక్రేని మ‌ర‌చిపోయార‌ని ఎంఎన్ ఎస్ చీఫ్ రాజ్‌ ఆరోపించారు. అంతేకాదు, విదర్భ ప్రాంతానికి సీఎం రావ‌డంలేద‌ని, రెండేళ్లుగా మంత్రాలయానికి రావడం మానేశార‌ని విమ‌ర్శించారు. మహారాష్ట్రలోని సమస్యలతో హనుమాన్ చాలీసా పఠించమని అడిగిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మర్చిపోయార‌ని ఎంఎన్ఎస్ ఆరోపిస్తుంది.

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే గతంలో మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం వివాదాస్పదమైంది. అంతేకాదు, ఆ డిమాండ్ నెరవేర్చకపోతే “హనుమాన్ చాలీసా” ప‌ఠించ‌డానికి లౌడ్ స్పీకర్లను ప్లే చేస్తామని హెచ్చరించారు. “మే 3లోగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లను మూసివేయాలి. లేకుంటే లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా వాయిస్తాం. ఇది సామాజిక సమస్య, మతపరమైన అంశం కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాను, మేము ఈ అంశంపై వెనక్కి వెళ్ళబోము, ”అని MNS చీఫ్ హెచ్చ‌రించారు.