₹ 57,000 Crore:గౌతమ్‌ ఆదానీ “లోహ” సంకల్పం.. ఆ రాష్ట్రంలో రూ.57 వేల కోట్లకుపైగా పెట్టుబడులు!

గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఏది పట్టినా బంగారం అవుతోంది. ఆయన ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టినా సక్సెస్ అవుతున్నారు. మంచి ఊపులో ఉన్న గౌతమ్‌ అదానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 12:05 PM IST

గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఏది పట్టినా బంగారం అవుతోంది. ఆయన ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టినా సక్సెస్ అవుతున్నారు. మంచి ఊపులో ఉన్న గౌతమ్‌ అదానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఒక రాష్ట్రంలో 57వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆ రాష్ట్రమే ఒడిశా.అదానీ గ్రూప్‌కు చెందిన 2 మెటల్ వ్యాపార ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. రెండు మెటల్ వ్యాపార ప్రాజెక్టుల్లోనూ గ్రూప్ మొత్తం రూ.57,575 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 9300 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరెంతో మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది.

ఒడిశాలోనే ఎందుకు?

దేశంలోనే భారీ బేస్ బాక్సైట్ నిల్వలు ఒడిశాలో ఉన్నాయి. ఇనుప ఖనిజ నిక్షేపాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఒడిశాలో 4 MMPTA సామర్థ్యంతో సమీకృత అల్యూమినా రిఫైనరీ, 30 MMPTA సామర్థ్యంతో ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ను అదానీ కంపెనీ చేపట్టనుంది. వీటిలో భాగంగా బాక్సైట్ గనుల సమీపంలో ఇంటిగ్రేటెడ్ అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేస్తారు. ఇది స్మెల్టర్ గ్రేడ్ అల్యూమినాను ఉత్పత్తి చేస్తుంది.

ఆదిత్య బిర్లా, వేదాంతలతో పోటీ..

ముంద్రా అల్యూమినియం లిమిటెడ్ పేరిట గత డిసెంబర్ లోనే అదానీ గ్రూప్ ఓ అనుబంధ సంస్థను నెలకొల్పింది. ఆదిత్య బిర్లా గ్రూప్, లండన్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వంటివారు ఆధిపత్యం చెలాయిస్తున్న రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశిస్తోంది. ఒడిశా రాష్ట్రంలో శుద్ధికేంద్రం, క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను నిర్మించడానికి అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఆమోదం పొందింది. ఇక అదానీ గ్రూప్ అన్ని రంగాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. తొలుత వ్యవసాయోత్పత్తుల వ్యాపారంలో ఉన్న అదానీ క్రమంగా నౌకాశ్రయాల రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వరుసగా విమానాశ్ర యాలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో వేగంగా అడుగులు వేశారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న హోల్సిమ్ లిమిటెడ్ కు చెందిన భారత విభాగాన్ని సొంతం చేసుకోవటం ద్వారా రాత్రికి రాత్రే అదానీ గ్రూప్ సిమెంట్ తయారీ రంగంలోకి ప్రవేశించింది. ఇదే వరుసలో లోహ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.