Site icon HashtagU Telugu

Gut Health: గట్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్స్‌ కచ్చితంగా తీసుకోవాలి..!

These Vitamins Must Be Taken To Keep The Gut Healthy..!

These Vitamins Must Be Taken To Keep The Gut Healthy..!

గట్‌ హెల్త్‌ (Gut Health) ఉంటేనే.. మనం శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. గట్‌ అనేది.. నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీష నాళం, పాయువు వరకు ఉంటుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే.. జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యల కారణంగా.. క్రోన్’స్ వ్యాధి, పెద్ద ప్రేగులలో వాపు, ఎండోక్రైన్ వ్యవస్థలో సమస్యలు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. గట్‌ సమస్యల కారణంగా.. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి అనేక రకాల మానసిక సమస్యలు ఉబ్బంది పెడతాయి. మన ఆహారంలో కొన్ని విటమిన్లు ఉండేలా జాగ్రత్తపడితే.. గట్‌‌‌ (Gut) ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్‌ సీ:

మన శరీరంలో కొల్లాజెన్‌ అనే ప్రొటీన్‌ను ప్రాసెస్‌ చేయడానికి విటమిన్‌ సీ అవసరం. గట్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే.. కనెక్టివ్‌ టిష్యూస్‌ తయారు చేయడానికి కొల్లాజెన్‌ అవసరం. గట్ మైక్రోబయోమ్‌లో మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యతను కాపాడటానికి విటమిన్‌ సీ సహాయపడుతుంది. ఈ విటమిన్‌ సీ లోపం వల్ల పేగులలో సమస్యలు వస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ జబ్బులకు దారి తీస్తుంది. మీ గట్‌ హెత్త్‌ను కాపాడుకోవడానికి.. సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, బంగాళదుంపలు, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌ వంటి ఆహారం మీ డైట్‌లో చేర్చుకోండి.

విటమిన్‌ డీ:

విటమిన్ డి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మాత్రమే కాదు.. గట్‌ హెత్త్‌కు సహాయపడుతుంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్‌ డీ లోపం కారణంగా.. పేగులలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో విటమిన్ డీ స్థాయిలు తగ్గితే.. దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విటిమిన్‌ డీ స్థాయిలు, గట్‌లోని మంచి బ్యాక్టీరియా సంఖ్య మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. మీ ఆహారంలో చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, ఓట్స్‌ తీసుకుంటే.. విటమిన్‌ డీ సమృద్ధిగా లభిస్తుంది.

విటమిన్‌ B6:

విటమిన్ B6 ను పిరిడాక్సిన్ అని కూడా అంటారు. ఇది మీ జీర్ణవ్యవస్థ మీరు తినే ప్రోటీన్‌ను ప్రాసెస్ చేయడంలో సహాయపడే ముఖ్యమైన విటమిన్. విటమిన్ B6 శనగలు, సాల్మన్ ఫిష్‌, చికెన్, బంగాళదుంపలు, అరటిపండ్లు, ఓట్స్, కాలే, నట్స్, ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, చికెన్, ఆకుకూరలు, పండ్లలో పుష్కలంగా ఉంటుంది.

విటమిన్‌ A:

గట్‌ ఆరోగ్యానికి సహాయపడే ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్‌ ఏ ఒకటి.. ఇది పేగు లైనింగ్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్‌ A లోపం ఉన్నవారితో పోలిస్తే.. విటిమిన్‌ A సమృద్ధిగా ఉన్నవారికి.. విరేచనాల సమస్యలు తక్కువగా ఉంటాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మెటాబోలైట్ రెటినోయిక్ యాసిడ్ గట్ బ్యాక్టీరియా ఉత్పత్తిని విటమిన్‌ A నియంత్రిస్తుంది. ప్రేగుల చుట్టూ ఉండే కణాలు మన ఆహారం నుంచి విటమిన్ Aని తీసుకుంటాయి, దానిలో కొంత భాగాన్ని రెటినోయిక్ యాసిడ్‌గా మారుస్తాయి. ఇది గట్‌లోని రక్షణ, వ్యాధికారక నిరోధకత మధ్య సమతుల్యతను నియంత్రిస్తుంది. మీ డైట్‌లో సాల్మన్, అవకాడో, షుగర్ బీట్, కాలే, స్క్వాష్, ముల్లంగి, క్యారెట్, రెడ్ బెల్ పెప్పర్, ఆకుకూరలు, మామిడి, ద్రాక్షపండు, పుచ్చకాయ, బొప్పాయి, నేరేడు పండు, జామ వంటి ఆహారం తీసుకుంటే.. విటమిన్‌ ఏ పుష్కలంగా అందుతుంది.

విటమిన్‌ B12:

విటమిన్ బి శరీరం ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, ఆహారం నుండి శక్తిని తీసుకోవడంలో సహాయపడుతుంది. B గ్రూప్‌లో విటమిన్ B12 చాల ముఖ్యమైనది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు డయేరియా, వికారం, ఇన్ఫ్లమేషన్‌ వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటే, మీకు B12 లోపం ఉండవచ్చు. లీన్ మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బీట్‌రూట్, స్క్వాష్, పుట్టగొడుగులు, బంగాళదుంపలలో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. ఈ ఆహారం తీసుకుంటే మీ గట్‌ ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read:  COVID-19: మళ్లీ కరోనా కలకలం.. 4 నెలల గరిష్టానికి కేసులు.. ఒకేరోజు 841 మందికి ఇన్ఫెక్షన్