PCOD: PCODకి చెక్ పెట్టండి ఇలా…!

మనదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో నలుగురు పిసిఓడి సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. పిసిఓడి గర్భశయానికి సంబంధించిన వ్యాధి. పిసిఓడి ఉన్నవారు రుతుక్రమం సమస్యతో బాధపడుతుంటారు.

  • Written By:
  • Updated On - January 28, 2022 / 04:42 PM IST

మనదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో నలుగురు పిసిఓడి సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. పిసిఓడి గర్భశయానికి సంబంధించిన వ్యాధి. పిసిఓడి ఉన్నవారు రుతుక్రమం సమస్యతో బాధపడుతుంటారు. కొందరికి అధికంగా రక్తస్రావం అయితే…మరికొందరికి ఆలస్యంగా పీరియడ్స్ వస్తుంటాయి. లేదంటే ప్రతి 15రోజులకు ఒకసారి రక్తస్రావం అవుతుంటుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. దారితప్పిన లైఫ్ స్టైల్ ఇందుకు కారణం. దీనివల్లే మన హార్మోన్లో అసతుల్యత ఏర్పడుతుంది. ఈ హార్మన్ల అసమతుల్యత వల్ల పురుషులలో కంటే స్త్రీలలోనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమలో పీసీఓడీ బాధితులుగా మారిపోతున్నారు. అంతేకాదు శరీర భాగాలపై అధికంగా వెంట్రకలు కనిపిస్తుంటాయి. మొటిమలు ఏర్పడతాయి. బరువు పెరిగిపోతారు. ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా మారుతుంది. మానసిక సమస్యలతో సతమతమవుతుంటారు.

పీసీఓడీకి కారణాలు..:
పీసీఓడీ అనేది మారుతున్న లైఫ్ స్టైల్ కు సంబంధించిన వ్యాధి. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అవలంబించడం ద్వారా దీన్నినుంచి బయటపడవచ్చు. జంక్ ఫుడ్, బయటి ఆహార పదార్థాలు తినే మహిళలు దీని బారిన పడుతుంటారు. క్రమం తప్పకుండా వ్యాయాయం చేయని మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం, బరువు పెరగడం, చిరాకకుగా ఉండటం వంటివి మహిళలకు అత్యంత ప్రమాదకరం.
ముందే చెప్పినట్లుగా ఇది లైఫ్ స్టైల్ కు సంబంధించినది కాబట్టి ముందుగా మీరు మీ ఆహారంపై ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. దీనికి ఔషదం కూడా ఉంది. చికిత్స తీసుకోనట్లయితే ఆరోగ్యం మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జీవన శైలిని మెరుగుపరుచుకోవాలి.
విటమిన్ డి: విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని పీసీఓడి బాధితులైన మహిళలు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన అరగంటలోపు ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే నానబెట్టిన బాదం, వాల్ నట్స్ తీసుకుంటుండాలి. గుడ్డులోని తెల్లసొన, పన్నీర్ శాండ్ విచ్ లు, ఓట్స్ వంటి ప్రోటీన్లను అధికంగా ఉండేలా చూసుకోవాలి. భోజనానికి రెండు గంటల ముందు సలాడ్ పుష్కలంగా తినాలి. రాత్రి భోజనంలో సూప్, ఇడ్లీ, పన్నీర్ తీసుకోవాలి. మంచినీళ్లు ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.

వ్యాయామం: ప్రతిరోజు నడక, వ్యాయామం అనేది అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు నడక అలవాటు చేసుకోండి. సాధారణ యోగా క్రమం తప్పకుండా చేయండి.
వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీ, కేక్, చిప్స్, కూల్ డ్రింక్స్, ఐసీ క్రం, ప్యాక్ చేసిన ఆహారం వంటి వాటిని అస్సలు తీసుకోవద్దు. ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీటు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవద్దు.
ఇక ఆకుకూరలు, ఫెన్నెల్, గ్రీన్ క్యాప్సికమ్, మిరపకాయ, బీన్స్ క్యారెట్, యాపిల్స్, కివీ, బెర్రీలు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. జీవక్రియను పెంచేందుకు గ్రీన్ టీని రోజుకు రెండు నుంచి మూడుసార్లు తీసుకోండి. ఆలివ్ నూనె ఉపయోగించడం మంచిది. గుడ్లు, చేపలు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బాదం, వాల్ నట్స్, టమోటాలు, అవిసె గింజలు, దాల్చిన చెక్క , పసుపు మీ ఆహారంలో తరచుగా తీసుకోనెలా జాగ్రత్తలు తీసుకోండి.