Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో పెద్దలు కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటే తాగకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 07:45 AM IST

సాధారణంగా మన ఇంట్లో పెద్దలు కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటే తాగకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కూల్ వాటర్ తాగిన వెంటనే రాకపోయినా కూడా కొద్ది రోజులకు కూల్ వాటర్ తాగిన ప్రభావం కనిపిస్తుంది. చల్లనీరు తాగడం వల్ల మన శరీరంలో ఉండే జరరాగ్ని అనేది చల్లారిపోతుంది. చల్లనీరు తాగిన తర్వాత చల్లారిన ప్రేగులు, కణాలు నాడులు అని కూడా తిరిగి వేడెక్కడానికి కొంత సమయం తీసుకుంటాయి.

అలా చల్ల నీరు తాగిన తర్వాత మళ్లీ 15 నిమిషాల సమయం తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఎదాస్థితికి వస్తాయి. అలాగే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల పొట్టలో కొవ్వు కరుగుతుంది. చల్లని నీరు తాగడం వల్ల కొవ్వులు గడ్డకట్టి తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. ఎప్పుడు కూడా భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో తాగాలి అనిపించిన గోరువెచ్చని నీరు తాగండి. అదేవిధంగా చలికాలంలో బిందెలలో ఉన్న నీరు కూడా తాగకూడదు.

చల్లనివి తాగిన ప్రమాదమే అలాగే అతి వేడి ఉన్న నీరు తాగినా కూడా లివర్ కు ప్రేగులకు ప్రమాదం. అంతేకాకుండా కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కేలరీలు నెమ్మదిగా బర్న్ అయ్యి శరీర బరువు పెరగడానికి దోహదపడతాయి. అదేవిధంగా కూల్ వాటర్ జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఏ సీజన్లో అయినా కూడా కూల్ వాటర్ తాగడం అంత మంచిది కాదు. మనం కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. అదేవిధంగా పోషకాలు కూడా శరీరానికి అందవు.