Corona: రోజులో ఎన్ని నిముషాలు వ్యాయామం చెయ్యాలి.. చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయ్?

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం విలువ ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. అయితే జీవనశైలి మంచి

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 07:45 AM IST

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం విలువ ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. అయితే జీవనశైలి మంచి ఆహారపు అలవాట్లు అలాగే నియమాలను పాటించిన వారు వైరస్ ను తట్టుకొని నిలబడగలిగారు. అయితే కేవలం కరోనా మహమ్మారి కోసం కాకపోయిన ప్రస్తుత జీవన శైలిలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధగా చూపడం లేదు. అయితే మనలో ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఎటువంటి వ్యాధులను అయినా సులువుగా ఎదుర్కొనవచ్చు. అయితే ఇటువంటి వాటికి వ్యాయామం తప్పనిసరి. తరచుగా శారీరక వ్యాయామం చేసి శరీరాన్ని కష్టపెట్టడం వల్ల హాని చేసే పదార్థాలు కొవ్వులు బయటకు వెళ్లిపోతాయి. కాగా ఎంత సమయం పాటు వ్యాయామం చేయాలి అన్న విషయానికి వస్తే..

ఒకరు ఎంత సమయం పాటు శారీరక వ్యాయామం చేయాలన్న దానికి అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పలు వివరాలు విడుదల చేసింది. వయోజనుడైన ఒక వ్యక్తి సగటున ఒక వారంలో 150 నిమిషాల పాటు మధ్యస్థ స్థాయి ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. లేదంటే 75 నిమిషాల పాటు కఠోర ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. బ్రిస్క్ వాకింగ్,జాగింగ్ లేదా రన్నింగ్ చేసుకోవచ్చు. రోజువారీ జీవితంలో భాగంగా చేసే కేలరీల ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని వైద్యులు చూస్తున్నారు. అలాగే వారంలో శారీరక వ్యాయామానికి వెచ్చించాల్సిన కనీస సమయం ఎంతన్న దానిపై పరిశోధకులు ఎన్నో ఏళ్ల పాటు శ్రమిస్తూనే ఉన్నారు.

2008లో అమెరికన్లకు ఉద్దేశించిన ఫిజికల్ యాక్టివిటీ గైడ్ లైన్స్ సైతం 150 నిమిషాలను సూచించింది. అంటే నిత్యం కనీసం 30 నిమిషాల చొప్పున ఏరోబిక్ ఎక్స్ ర్ సైజ్ లను వారంలో కనీసం ఐదు రోజులు చేయాలి. ఇంకా సమయం ఉండి కుదిరితే ఏడు రోజులు చేయడం ఇంకా మంచిదే.అయితే ఏ రకం అన్నదానితో సంబంధం లేకుండా శారీకక కార్యకలాపాలతో శరీరాన్ని కష్టపెట్టడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఏదో ఒక పని చేస్తూ చురుగ్గా ఉండే వారు.. నిశ్చలంగా, పెద్దగా కదలకుండా ఉండేవారి కంటే మంచి ఆరోగ్యంతో, ఎక్కువ కాలం పాటు జీవిస్తారని పరిశోధకులు అంటున్నారు. ఏరోబిక్ ఎక్సర్ సైజులను ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు తీసుకొచ్చే వ్యాయామాలుగా నిపుణులు భావిస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక సమస్యల ముప్పును ఏరోబిక్ వ్యాయామాలు తగ్గిస్తాయి. అలాగే, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.