Diabetes : ఎంత ప్రయత్నించినా…షుగర్ కంట్రోలోకి రావడం లేదా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

షుగర్...ప్రపంచంలోని సగంమందిని పట్టిపీడిస్తున్న సమస్య. దీనిబారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.

  • Written By:
  • Publish Date - August 28, 2022 / 06:00 PM IST

షుగర్…ప్రపంచంలోని సగంమందిని పట్టిపీడిస్తున్న సమస్య. దీనిబారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రతి నలుగురిలో ముగ్గురు షుగర్ తో బాధపడుతున్నారు. దీనంతటికి కారణం మన జీవనశైలి. క్రమబద్ధమైన ఆహారాన్ని చక్కగా పాటించినట్లయితే దీన్ని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. కానీ అలాంటి క్రమశిక్షణ ఎంతమంది పాటిస్తారు. ఎందరికి సాధ్యం అవుతుంది. చాలామంది మధుమేహవ్యాధిగ్రస్తులు దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు మెడిసిన్ పై ఆధారపడుతారు. ఆహారం, లైఫ్ స్టైల్ వంటి విషయాల్లో మార్పులకు మాత్రం సమయం కేటాయించరు. కానీ ఆహారం, మన జీవన విధానాన్ని మార్చుకున్నట్లయితే షుగర్ ను సులభం నియంత్రించుకోవచ్చని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఇక షుగర్ కంట్రోల్లో లేకపోతే ఎలాంటి ఆనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు ఇవి ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. గుండెజబ్బు, గుండెపోటు, కేన్సర్ పై పోరాటానికి వీలుగా కొన్ని సూచనలతో డబ్ల్యూహెచ్ ఓ ట్వీట్ చేసింది. గుండె జబ్బు, కేన్సర్ , షుగర్, లంగ్స్ సమస్యలు ఇవి ప్రపంచంలో 70శాతం మరణాలకు కారణం అవుతున్నాయి. వీటి బారిన పడిన మరణించే వారి వయస్సు కూడా 70ఏండ్ల లోపే ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఏం చేయాలో సూచించింది డబ్ల్యూహెచ్ఓ.

ఉప్పు:
ఒకరోజుకు ఒకరు ఒక టీస్పూన్ లేదా ఐదు గ్రాములకు మించి ఉప్పు తీసుకోవద్దు. ఏ రూపంలో తీసుకున్నా సరే…ఈ పరిమితి మాత్రం దాటవద్దు. ఉప్పు కేవలం మనం వంటల్లో మాత్రమే వాడుతాం కదా అనే డౌట్ మీకు వస్తుంది కావచ్చు. కానీ కూరగాయల్లోనూ ఉప్పు ఉంటుంది కానీ తక్కువ పరిమాణంలో ఉంటుంది. స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటిలో అధికమోతాదులో ఉప్పు ఉంటుంది. దీని వల్ల శరీరంలోకి సోడియం చేరుతుంది. అయితు ఉప్పుకు బదులుగా ఎండబెట్టిన కరివేపాకు, తాజా దినుసులు తీసుకుంటే మంచిది.

చక్కెర:
ఒకవ్యక్తి ఒకరోజులో 50గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదు. అంటే రోజులో 12 టీ స్పూన్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ 12 టీస్పూన్ల తక్కువగా అనుకుంటే అది 25 గ్రాములకే పరిమితం చేసుకోవాలి. ఇక రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఉప్పు, చక్కెర లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫ్యాట్:
ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలను వాడుకోవడం మంచిది. వైట్ చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. మటన్ జోలికి వెళ్లకూడదు. నూనెలో వేయించిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. పదార్థాలను వేడి చేసుకుని తినకూడదు. వీటివల్ల శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ రిలీజ్ అవుతాయి. కారణంగా కొలెస్ట్రాల్ ను పెంచి గుండెపోటుకు కారణం అవుతాయి. ఆల్కాహాల్ కు దూరంగా ఉంటూ…నీరు ఎక్కువగా తీసుకోవాలి.

హెల్దీ ఫుడ్:
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముడి ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాలిష్ట్ , ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్, వీట్.. తీసుకోవాలి. ఆకుపచ్చని తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు ఒక గుడ్డు మాత్రమే తీసుకోవాలి. వీటన్నింటితోపాటుగా వ్యాయామం తప్పనిసరి.