YSR Rythu Bharosa scheme:రైతులకు జగన్ భరోసా!

ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్‌ తొలివిడత నిధులను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జ‌మ‌చేశారు.

  • Written By:
  • Publish Date - May 16, 2022 / 03:57 PM IST

ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్‌ తొలివిడత నిధులను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జ‌మ‌చేశారు. ఏలూరు జిల్లా గ‌ణ‌ప‌వ‌రంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ముఖ్య‌మంత్రి వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా కింద 50 ల‌క్ష‌ల 10 వేల 2 వంద‌ల 75 రైతు కుటుంబాలకు తొలి విడతగా 3 వేల 758 కోట్ల రూపాయ‌ల పెట్టుబడి సాయం అందించారు.

రాష్ట్రం ఖరీఫ్‌ పనులు మొదలు కాక ముందే వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్ర‌జ‌లంద‌రి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. నిర్దేశించిన‌ కేలండర్ ప్ర‌కారం క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామని ఆయన అన్నారు.