Prashanth Kishore Meets CBN : అప్పుడు జగన్ తో..ఇప్పుడు బాబుతో.. ప్రశాంత్ కిషోర్ ఏంచేస్తాడో..?

  • Written By:
  • Publish Date - December 23, 2023 / 04:10 PM IST

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore)..మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తో భేటీ కావడం ఇప్పుడు ఏపీ (AP) రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో జగన్ (JAGAN) గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడనే సంగతి చెప్పాల్సిన పనిలేదు.

ఐప్యాక్ వ్యవస్థాపకుల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోడీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత పంజాబ్ లో కాంగ్రెస్, ఢిల్లీలో ఆప్, ఏపీలో జగన్ విజయం వెనుక కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ముందే జగన్ నాడు ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు. జగన్ గెలుపు తరువాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నా..ఆయన టీం వైసీపీ కోసం పని చేస్తూ వస్తుంది. ఇదే సమయంలో ఐ ప్యాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి..రుషి రాజ్ సింగ్ వైసీపీ కోసం పని చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రశాంత్ కిషోర్ ఐడియాస్..ప్రచారం తో గత ఎన్నికల్లో జగన్ విజయ డంఖా మోగించారు. జగన్ కోసం పని చేసి ఉండటంతో..జగన్ బలాలు, బలహీనతలు, వ్యూహాల పైన ప్రశాంత్ కు పూర్తి అవగాహనా ఉంది. దీంతో ప్రశాంత్ కిషోర్..ఇప్పుడు బాబు తో భేటీ కావడం సర్వత్రా చర్చగా మారింది. హైదరాబాద్ నుండి గన్నవరంకు ప్రత్యేక జెట్ లో నారా లోకేష్ కలిసి ప్రశాంత్ కిషోర్ చేరుకొని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరి వీరి మధ్య ఎలాంటి చర్చలు జరగుతున్నాయి..సమావేశం అనంతరం మీడియా తో ఏమైనా మాట్లాడతారా..? లేదా అనేది చూడాలి.

Read Also : Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!