Nagarjuna Sagar : సాగ‌ర్ పై కేసీఆర్ ఇష్టం..జ‌గ‌న్ కు క‌ష్టం!

ఏపీ ప్ర‌భుత్వం మొత్తుకుంటున్న‌ప్ప‌టికీ తెలంగాణ స‌ర్కార్ విద్యుత్ ఉత్ప‌త్తి కోసం నాగార్జున సాగ‌ర్ నుంచి నీటిని తోడేస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఏ మాత్రం తెలంగాణ స‌ర్కార్ త‌గ్గ‌డంలేదు.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 08:00 PM IST

ఏపీ ప్ర‌భుత్వం మొత్తుకుంటున్న‌ప్ప‌టికీ తెలంగాణ స‌ర్కార్ విద్యుత్ ఉత్ప‌త్తి కోసం నాగార్జున సాగ‌ర్ నుంచి నీటిని తోడేస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఏ మాత్రం తెలంగాణ స‌ర్కార్ త‌గ్గ‌డంలేదు. డెడ్ స్టోరీజికి నీటి మ‌ట్టం వెళ్లిన‌ప్ప‌టికీ నాగార్జునసాగర్ డ్యాం నుండి జలవిద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ 4,000-5,000 క్యూసెక్కుల నీటిని డ్రా చేస్తూనే ఉంది. ఫ‌లితంగా గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు మంచినీళ్ల , సాగునీళ్ల‌ స‌మ‌స్య ముంచుకొస్తోంది. .అయిన‌ప్ప‌టికీ ఏపీ సీఎం జ‌గన్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌డం గ‌మ‌నార్హం.

‘‘విద్యుత్‌ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేఆర్‌ఎంబీకి విన్నవించినా తెలంగాణ భేఖాత‌రు చేస్తుంద‌ని ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి చెబుతున్నారు. ఏప్రిల్ 29న 1,104 క్యూసెక్కుల నీటిని తెలంగాణ తోడేసింద‌ని లెక్కించారు. అలాగే, ఏప్రిల్ 28న 5,211 క్యూసెక్కులు, ఏప్రిల్ 27న 4,934 క్యూసెక్కులు, ఏప్రిల్ 24న 3,868 క్యూసెక్కులు విద్యుత్ ఉత్ప‌త్తికి తెలంగాణ వాడేసింది. స‌గ‌టును రోజుకు 4,000 నుండి 5,000 క్యూసెక్కుల నీళ్లు డ్యాం నుంచి తోడేస్తోంద‌ని ఆయ‌న లెక్కించారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 539 అడుగుల ఉంది. వాస్త‌వంగా 590 అడుగులు ఉండాలి. ప్రస్తుత నీటి నిల్వ 186.25 tmcft (59.69 శాతం) వద్ద FRL వద్ద 312.05 tmcft ఉంద‌ని లెక్కించారు. రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజీ నీటిమట్టం 510 అడుగులుగా కృష్ణా బోర్డు చెబుతోంది. రిజర్వాయర్‌లో ఇంకా కేవలం 29 అడుగుల నీటిమట్టం ఉండగా, ప‌రిమాణం ప్ర‌కారం దాదాపు 55 టీఎంసీల నీరు ఉంది. గతంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నివసించే ప్రజలకు మే 15 నుంచి 10 నుంచి 15 రోజుల పాటు కృష్ణా నది కుడి ప్రధాన కాలువ నుంచి తాగునీటి సరఫరా చేయాలని జలవనరుల శాఖ అధికారులు భావించారు. అందుకోసం దాదాపు 15 టీఎంసీల నీరు అవసరం. ఒక వేళ వర్షాలు కురవని పక్షంలో ఆగస్టులో మళ్లీ తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. సమయానికి వర్షాలు కురవని పక్షంలో జూలై నుండి ఖరీఫ్ సీజన్‌లో ప్రారంభమయ్యే RMC కమాండ్ ఏరియాలోని పంటల సాగుకు నీటిని సరఫరా చేయవలసి ఉంది.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్రధాన పవర్‌హౌస్‌ నుంచి హైడల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కృష్ణానదిలోకి విడుదల చేయడంతో డ్యామ్‌లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వంటి దిగువ ప్రాజెక్టులు దాదాపు నిండిపోవడం కార‌ణంగా సముద్రంలోకి వృథాగా పోతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైతే, జూలై లేదా ఆగస్టు వరకు వర్షాలు ప‌డ‌క‌పోతే, శ్రీశైలం వంటి అప్‌స్ట్రీమ్ ప్రాజెక్టుల నుండి నాగార్జునసాగర్ డ్యాంలోకి నీరు రాదని ఏపీ జలవనరుల అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వాస్త‌వాల‌కు భిన్నంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జలవనరుల ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఏప్రిల్ 4న లేఖ రాశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవద్దని బోర్డును ఆయన కోరారు.

కృష్ణాబోర్డు, ఏపీ ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్న‌ప్ప‌టికీ తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం విద్యుత్ ఉత్ప‌త్తి కోసం సాగ‌ర్ నుంచి నీటిని తోడేస్తోంది. అన్మ‌దమ్ముల్లా క‌లిసి ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మీద కేసీఆర్ పైచేయిగా ఉన్నారు. ఫ‌లితంగా ఏపీకి సాగు, తాగునీటి సంక్షోభం పొంచి ఉంది.