Chinese woman: ఢిల్లీలో చైనా మహిళ అరెస్ట్.. కారణమిదే..?

నకిలీ గుర్తింపుతో భారత్‌లో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను ఓ చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

  • Written By:
  • Updated On - October 21, 2022 / 04:00 PM IST

నకిలీ గుర్తింపుతో భారత్‌లో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను ఓ చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ మహిళ చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌కు చెందిన కై రుయోగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని టిబెట్ శరణార్థుల క్యాంప్‌లో సదరు మహిళ గత కొంతకాలంగా ఆశ్రయం పొందుతోంది.

టిబెట్ నుంచి భారతదేశానికి వచ్చిన శరణార్థుల కోసం ఢిల్లీలో మంజు కా టిల్లా పేరుతో ప్రభుత్వం ఓ క్యాంప్ నిర్వహిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌కు సమీపంలోఈ క్యాంప్ ఉంది. విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. ఆ మహిళపై అనుమానం రావడంతో విచారించిన ఆధికారికులకు అసలు విషయం తెలిసింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను విచారించినప్పుడు ఆ మహిళ చైనా పౌరురాలని విచారణలో తేలింది. 2019లో చైనా నుంచి భారత్‌లో అడుగుపెట్టినట్లు వెల్లడైంది.

ఆమెపై సెక్షన్ 120 (బి), 419, 420, 467.. ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, ఫారినర్స్ యాక్ట్ ప్రకారం ఆ మహిళ ప్రస్తుతం ప్రత్యేక పోలీసు సెల్‌లో ఉందని పోలీసులు తెలిపారు. చైనాలోని కమ్యూనిస్టు లీడర్లతో తనకు ప్రాణభయం ఉందని, అందుకే పేరు మార్చుకుని భారత్‌లో తలదాచుకుంటున్నానని చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె గూఢచర్య కార్యకలాపాలకు ఏమైనా పాల్పడిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.