Mahatma Gandhi – 1947 August 15th : 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా గాంధీ ఏం చేశారంటే ?

Mahatma Gandhi - 1947 August 15th : మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి మూల కారకుడు ఆయన.. దేశం మొత్తాన్ని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏకం చేసిన మహా మనిషి ఆయన.. 

  • Written By:
  • Updated On - August 13, 2023 / 07:23 AM IST

Mahatma Gandhi – 1947 August 15th : మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి మూల కారకుడు ఆయన.. 

దేశం మొత్తాన్ని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏకం చేసిన మహా మనిషి ఆయన.. 

నిత్యం దేశం గురించే తపించిన మహర్షి ఆయన..

అలాంటి చరిత్ర పురుషుడు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండిపోయారు.. 

ఆ రోజున  ఓ వైపు ఢిల్లీలో స్వాతంత్ర వేడుకలకు ఏర్పాట్లు  జరుగుతుంటే.. మరోవైపు బెంగాల్ లో జాతిపిత మహాత్మాగాంధీ నిరాహార దీక్షకు కూర్చున్నారు.  

బెంగాల్‌లోని నోవాఖలీలో హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడానికి  ఆయన ఈ నిరాహారదీక్ష చేశారు.  

దీన్నిబట్టి గాంధీజీకి పదవుల కన్నా.. దేశంలో శాంతి, ఐక్యతే ముఖ్యమని స్పష్టంగా అర్ధమవుతుంది.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన వేళ..  పదవులు కోరకుండా హిందూ-ముస్లిం ఐక్యతపై దృష్టిపెట్టిన ఆ పావన మూర్తిని ఎంత పొగిడినా తక్కువే..  

ఇలాంటి విశాల ఆలోచనా దృక్పథం ఉండటం వల్లే  గాంధీజీ భారత జాతిపిత అయ్యారు.. 

ఇటువంటి మహోన్నతుడు.. మహాత్ముడు .. మన గడ్డపై పుట్టినందుకు గర్విద్దాం.. అందరికీ ఆయన గురించి తెలియజేద్దాం..

Also read : Ganesh Statue: గణపతి విగ్రహం కొనేముందు ఇవి తప్పనిసరి

నెహ్రూ, పటేల్ లేఖకు గాంధీజీ జవాబు ఇదీ..

వాస్తవానికి ఆగస్టు 15న(Mahatma Gandhi – 1947 August 15th) భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. “ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి” అని ఆ లేఖలో కోరారు. ఆ లేఖకు గాంధీజీ సమాధానం ఇస్తూ.. “కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా” అని స్పష్టం చేశారు.

ఆగస్టు 14న రాత్రి.. 

జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగాన్ని ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, ఆరోజు గాంధీజీ  9 గంటలకే నిద్రపోయారు అని బీబీసీ ఒక కథనాన్ని ప్రచురించింది. లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు. ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమణ గీతం 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందింది.

Also read : TSRTC Gamyam: ఒక్క క్లిక్ తో బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు!

మరో మూడు దేశాలు కూడా.. 

ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.