Site icon HashtagU Telugu

Azadi Ka Amrit Mahotsav : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రాముఖ్యత..

Azadi Ka Amrit Mahotsav 202

Azadi Ka Amrit Mahotsav 202

Azadi Ka Amrit Mahotsav : బ్రిటిష్ తెల్లదొరల కబంధహస్తాల నుండి భరతమాతకు విముఖ్తి లభించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుతుంది. అసలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏమిటి..? దీనిని మార్చి 12 నే ఎందుకు ప్రారంభిస్తారు..? ఈ వేడుకలు ఏ ఏ ప్రాంతాలలో జరుపుతారు..? వంటివి తెలుసుకుందాం…

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (Azadi Ka Amrit Mahotsav) అంటే ఏమిటి..?

ఆజాదీ అంటే స్వేచ్ఛ.. అమృత్ అంటే అజ‌రామ‌రం.. మ‌హోత్సవ్ అంటే అతిపెద్ద సంరంభం.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే అజ‌రామ‌ర‌మైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంరంభం అని అర్థం. దాదాపు రెండు వంద‌ల ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వ‌ల‌స పాల‌కుల‌కు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోధ్యమం.. స్వాతంత్ర్యోద్యమం.. భారత జాతి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది.

‘Azadi Ka Amrit Mahotsav’ ఉత్సవాలను మార్చి 12న ప్రారంభించడానికి కారణం ఏమిటి..?

ఉప్పు ఫై బ్రిటిష్ తెల్లదొరలు వేసిన పన్నుకు వ్యతిరేకంగా గాంధీ..దండి మార్చ (ఉప్పు సత్యాగ్రహం) ప్రారంభించింది ఈరోజే. 1930 మార్చి 12 న సబర్మతి ఆశ్రమం నుండి ఆయన పాదయాత్ర చేపట్టారు. 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల వరకు ఈ యాత్ర సాగింది. ఈ యాత్రలో వేలమంది సత్యాగ్రహులతో కలిసి గాంధీ పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది.

భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా ..75 వారాలపాటు జరిగే ఉత్సవాలను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఉత్సవాలు మార్చి 12 నుండి మొదలై..ఆగస్టు 15 న ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

Azadi Ka Amrit Mahotsav వేడుకల కోసం 16 చరిత్రత్మక ప్రాంతాల గుర్తింపు :

ఈ మహోత్సవ్ ఉత్సవ వేడుకల కోసం 16 చరిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని ఖిలా రాయ్ పిథోరా వద్ద ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, ఐజ్వాల్‌లోని భువనేశ్వరి ఆలయం, ముంబయిలోని అగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కొణార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద వేడుకలు నిర్వహిస్తారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ప్రజలందరూ భాగం కావాలి..

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో ప్రజలందరూ భాగం కావాలని, గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్ వెబ్ సైట్ లో ఉంచాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి..?

భారత స్వాతంత్ర్య చరిత్రతో ముడిపడివున్న క్షణాలను గుర్తించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్న సెల్ఫీ పిక్ ను rastrugaan.in లో పోస్ట్ చేస్తే మీకు కేంద్రం నుండి ఓ సర్టిఫికెట్ ను అందజేయనున్నారు. ఇప్పటికే కొన్ని కోట్ల మంది సెల్ఫీ లు దిగి పోస్ట్ చేయడం జరిగింది.

Read Also: Gaddar Statue: ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం.. సమాధి వద్ద షర్మిల నివాళి