Patna Meeting : అశోకుడి గడ్డపై విపక్షాల సమరశంఖం.. ఆ రోజే ?

బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు "చలో పాట్నా"(Patna Meeting) అంటున్నాయి.. 

  • Written By:
  • Updated On - May 23, 2023 / 07:57 AM IST

బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు “చలో పాట్నా”(Patna Meeting) అంటున్నాయి.. 

అశోకుడి జన్మభూమి, బీహార్ రాజధాని పాట్నా(Patna Meeting) వేదికగా 2024 ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. 

విపక్ష కూటమి రెడీ అనే సందేశాన్ని దేశ ప్రజలోకి పంపేందుకు పాట్నా వేదికగా సమావేశం కాబోతున్నాయి. 

మే 29న లేదా 30న.. వాటిలో ఏ డేట్ కూడా సెట్ కాకపోతే జూన్ రెండో వారంలో పాట్నాలో కీలక భేటీకి విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. 

ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఏ విధమైన వ్యూహంతో కలిసికట్టుగా ముందుకు సాగాలి ?

ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి స్ట్రాటజీ అవసరం ?

బీజేపీ బలంగా ఉన్న చోట్ల జనంలోకి ఎలా వెళ్ళాలి ?

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం ఎలా ?

విపక్ష కూటమిని సమన్వయ పరిచే స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు ? 

ఇటువంటి ఎన్నో కీలక అంశాలపై త్వరలో పాట్నా వేదికగా జరగబోయే విపక్షాల మీటింగ్ లో క్లారిటీ రానుంది. 

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే లక్ష్యం కలిగిన విపక్షాలన్నీ ఏకమయ్యే వేదికగా బీహార్ రాజధాని పాట్నా నిలువనుంది. త్వరలోనే అక్కడ కీలక సమావేశాన్ని నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. ఈక్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. విపక్షాలను ఒకచోట చేర్చి ఐక్యతా సందేశాన్ని యావత్ దేశానికి వినిపించాల్సిన అవసరం ఉందని నితీష్ తెలిపారు. “జయప్రకాష్ నారాయణ ఉద్యమం ద్వారా దేశంలో మార్పుకు బీహార్ లోని పాట్నా ఆనాడు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇప్పుడు మరోసారి పాట్నాను అదే లక్ష్యానికి కేంద్రంగా మార్చాలి” అని వారం క్రితం తాను కలిసినప్పుడు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారని బీహార్ సీఎం వివరించారు. అందుకే పాట్నాలో విపక్షాల తరఫున కీలక భేటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన ఖర్గే, రాహుల్ ఎదుట ప్రతిపాదించారు. అందుకు రాహుల్, ఖర్గే సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దేశ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ విషయంలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్ తో ఆదివారం జరిగిన మీటింగ్ వివరాలపైనా వీరు చర్చించారు. ఆ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా .. ఢిల్లీ సర్కారుకు మద్దతుగా రాజ్యసభలో బిల్లుపై జరిగే ఓటింగ్ లో విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

also read : Mission 24: మిషన్ 24… విపక్షాల ఐక్యతకు నితీష్ దూకుడు

ఆ ఒక్కడు తప్ప .. 

ఈ పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి.. బీజేపీని ఓడించాలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యానికి బలమిస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే పాట్నా వేదికగా విపక్షాల సమావేశం నిర్వహించాలని నితీష్ సోమవారం చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్పిందని అంటున్నారు. గత కొన్ని నెలలుగా కేజ్రీ వాల్ , మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సహా ఎన్నో పార్టీల దిగ్గజ నేతలతో భేటీ అయి బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు ఒప్పించడంలో నితీష్ కీలక పాత్ర పోషించారు. త్వరలో పాట్నాలో విపక్షాల భేటీ జరిగితే.. ఆ క్రెడిట్ కూడా నితీష్ కే దక్కుతుంది. ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఒక్కరిని మాత్రమే.. నితీష్ ఒప్పించలేకపోయారు. బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తామని నవీన్ తేల్చి చెప్పడంతో ఆయనకు విపక్షాల కూటమిపై ఆసక్తి లేదని తేలిపోయింది.

also read : PM Modi Ravana Posters: రాముడిగా నితీష్.. రావణుడిగా మోదీ పోస్టర్లు

నితీష్ కు కీలక బాధ్యతలు ?

బిజూ జనతాదళ్, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ వంటి కొన్ని పార్టీలు మినహాయిస్తే మిగితావన్నీ కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ వ్యతిరేక కూటమి వైపే చూస్తున్నాయి అనేది క్లియర్. ఈ కూటమిలోని బలమైన ప్రాంతీయ పార్టీలు 2024 లోక్ సభ పోల్స్ లో తమతమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో కలిసి బీజేపీని ఎదుర్కోవాలని.. ఇక కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో దానితో కలిసి పోటీ చేయాలనే విధానాన్ని ఖరారు చేసుకోనున్నారు. త్వరలో పాట్నాలో జరగనున్న విపక్షాల భేటీలో దీనిపై ఒక రోడ్ మ్యాప్ సిద్ధం కానుంది. ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి? బీజేపీని ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవడం ఎలా ? బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఏం చేస్తే మంచిది ? అనే అంశాలపై పాట్నా మీటింగ్ తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. విపక్షాల కూటమిని లీడ్ చేసే స్టీరింగ్ కమిటీ లేదా వర్కింగ్ గ్రూప్ లో ఎవరు ఉంటారనే దానిపైనా ఆ మీటింగ్ లోనే నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. విపక్ష పార్టీలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న నితీష్ కుమార్ కు .. ఇందులో సముచిత స్థానం కేటాయించే అవకాశం ఉంది. పాట్నా మీటింగ్ కు ఆప్, టీఎంసీ, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కాంగ్రెస్, వామపక్షాలు, జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్ సహా మొత్తం 15 పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.