Site icon HashtagU Telugu

Kavach Vs Train Accidents : కవచ్ ఏమైంది ? ఒడిశా రైలు ప్రమాద కారణాలపై “సోషల్” డిబేట్

Kavach Safety System

Kavach Safety System

ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. మృతుల సంఖ్య పెరుగుతుండటం, ఎంతోమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు దేశ ప్రజల మనసును  కలచి వేస్తున్నాయి. బాధిత కుటుంబాల గోడును చెప్పడానికి మాటలు చాలవు. ఇక ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ పై రైల్వే శాఖ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ప్రమాదంపై వాడివేడి డిబేట్ జరుగుతోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న నెటిజన్స్  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్విట్టర్ వేదికగా నిలదీస్తున్నారు.  ప్రశ్నలు సంధిస్తున్నారు. రైళ్లు ఢీకొనకుండా ఆపే యాంటీ కొలిజన్ టెక్నాలజీ ‘కవచ్'(Kavach Vs Train Accidents) ఈ ప్రమాదాన్ని ఎందుకు ఆపలేదు ? అని పలువురు నెటిజన్స్  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్విట్టర్‌ వేదికగా అడిగారు. ఈ తరుణంలో  ‘కవచ్’తో ముడిపడిన కొన్ని వివరాలు తెలుసుకుందాం..    

కవచ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

KAVACH అనేది రైళ్లు ఒకదాన్ని ఇంకొకటి ఢీకొనకుండా నివారించడానికి మనదేశం సొంతంగా అభివృద్ధి చేసిన యాంటీ-కొలిజన్ టెక్నాలజీ. ఇది చాలా కచ్చితమైంది. పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. KAVACH  టెక్నాలజీలో  10,000 సంవత్సరాలలో కేవలం ఒకే ఒక పొరపాటు జరిగే ఛాన్స్ ఉంటుంది. అంత బాగా అది పనిచేస్తుంది. రైళ్లు ఒకదాన్ని మరొకటి  ఢీకొనకుండా అడ్డుగోడలా నిలుస్తుంది. అత్యధిక సేఫ్టీ ఇస్తున్నందుకు KAVACH  టెక్నాలజీకి SIL4 సర్టిఫికేట్ కూడా పొందింది. రైలు ప్రమాదాల సంఖ్యను సున్నాకి తగ్గించడం KAVACH లక్ష్యం.  రైళ్ల ఇంజన్లలో అమర్చబడిన పరికరాల నెట్‌వర్క్‌ను ఉపయోగించి .. ఒకే ట్రాక్ పై  రెండు రైళ్ల ఇంజన్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు  KAVACH వాటిని ముందుకు కదలకుండా ఆటోమెటిక్ గా బ్రేక్స్ వేసి ఆపేస్తుంది. రేడియో టెక్నాలజీ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ (GPS) సహాయంతో ఈ పరికరాలు పని చేస్తాయి. KAVACH తొలుత ఎదురుగా వచ్చే ట్రైన్ గురించి లోకో పైలట్‌లను హెచ్చరిస్తుంది. ఆ వెంటనే అత్యవసర బ్రేక్‌లను వేసి రైలును ఆటోమేటిక్‌గా ఆపివేస్తుంది.

Also read : Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం పట్ల చిరు, తారక్ దిగ్భ్రాంతి!

ఒడిశా రైలు ప్రమాదం ఇలా జరిగింది..   

KAVACH ఆపలేకపోయిందా ?

రైల్వే శాఖ చేసిన ప్రకటన ప్రకారం  ఒడిశా రైలు ప్రమాద ఘటనలో  హౌరా ఎక్స్‌ప్రెస్‌.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లు  ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదం జరిగి ఆగి ఉన్న  కోరమాండల్ ఎక్స్‌ప్రెస్  ను ఎదురుగా వచ్చిన హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. రైలు పట్టాలు తప్పిన సందర్భాల్లో  KAVACH సాంకేతికత పని చేయదు. కానీ ఇలా రైళ్లు ఢీకొన్నప్పుడు పనిచేస్తుంది. అయితే ఆ ట్రైన్ రూట్ లో ఇప్పటికే KAVACH సాంకేతికత ఇన్ స్టాల్ చేశారా ? లేదా ? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఆ రూట్ లో KAVACH సాంకేతికత ఇన్ స్టాల్ అయి ఉంటే కచ్చితంగా  హౌరా ఎక్స్‌ప్రెస్‌.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లు  ఢీకొనడం ఆగిపోయి ఉండేది. అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ లలో ఇంకా KAVACH సాంకేతికత ఇన్ స్టాలేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. బహుశా ఈ రూట్ లోనూ KAVACH ను ఇన్ స్టాల్ చేసి ఉండకపోవచ్చు. 2022 కేంద్ర  బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశంలోని 2,000 కి.మీ రైల్వే నెట్‌వర్క్‌ను కవచ్ టెక్నాలజీ ద్వారా పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ లెక్కన దేశంలోని కొన్ని రైల్వే సెక్షన్లలో మాత్రమే KAVACH  అందుబాటులోకి వచ్చింది.