Haj : లండన్ నుంచి మక్కాకు…6,500కిలోమీటర్లు నడిచిన వ్యక్తి..!!

సాధించాలన్న తపన ఉంటే...భయాన్ని అధిగమించేలా చేస్తుంది. ఎంతటి లక్ష్యాన్ని అయినా సరే చేరుకోకుండా ఆపడం ఎవరి తరము కాదు. ఇది నిరూపించాడు ఇరాక్-కుర్దిష్ మూలాలున్న లండన్ వ్యక్తి.

  • Written By:
  • Updated On - July 11, 2022 / 01:30 PM IST

సాధించాలన్న తపన ఉంటే…భయాన్ని అధిగమించేలా చేస్తుంది. ఎంతటి లక్ష్యాన్ని అయినా సరే చేరుకోకుండా ఆపడం ఎవరి తరము కాదు. ఇది నిరూపించాడు ఇరాక్-కుర్దిష్ మూలాలున్న లండన్ వ్యక్తి. హజ్ యాత్రలో భాగంగా మక్కా చేరుకునేందుకు లండన్ లోని వాల్వర్ హాంప్టన్ లో అడుగు మొదలుపెట్టి 6,500కిలోమీటర్లు నడిచి మక్కాను చేరుకున్నాడు. ఆడం మొహమ్మద్ ఆయన పేరు. వయస్సు 52 ఏళ్లు. నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్ ల మీదుగా నడుస్తూ 6,500కిలోమీటర్ల దూరాన్ని చేరుకున్నాడు ఆడం మొహమ్మద్.

గత ఏడాది ఆగస్టు 1న లండన్ లో ప్రారంభమైన అతడి నడక గతనెలలో సౌదీఅరేబియాలో ఆగింది. మక్కా చేరుకునేందుకు మొత్తంగా పది నెలల 25రోజులు పట్టింది. ప్రతిరోజూ సగటున 17.8 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ సందర్భంగా అతడు ఇస్లామిక్ పారాయణాలు కూడా పఠించాడు. ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులను తన వెంట తీసుకెళ్లుందుకు ఓ బండిని తయారు చేసుకున్నాడు. దాని బరువు మూడువందల కేజీలు.

శాంతి, సమానత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా తాను ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పాడు. దీని కోసం గో ఫండ్ మి లో ఓ పేజీని కూడా క్రియేట్ చేశాడు. నేను దీనిని కీర్తి కోసమో డబ్బు కోసమో కాదు ..మన జాతి మతం రంగుతో సంబంధం లేకుండా మానవులందరూ సమానమేనని ప్రపంచానికి చాటిచెప్పడమే నా లక్ష్యం. ఇస్లాం బోధించే శాంతి, ఐఖ్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికే నా ఈ పర్యటన అని పేర్కొన్నాడు.