Second Hand Phone : సెకండ్ హ్యాండ్ ఫోన్.. 10 చెక్స్

కొత్తగా విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్ల రేట్లు భారీగా ఉన్నాయి. వాటి డిజైన్లు కూడా అట్రాక్టివ్ గా లేవు.. ఈ తరుణంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లను (Second Hand Phone) కొనడానికి క్రేజ్ పెరిగింది. తక్కువ కాలం వాడిన.. తక్కువ డ్యామేజ్ అయిన స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇటువంటి టైంలో సెకండ్ హ్యాండ్ ఫోన్లను(Second Hand Phone) కొనే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 02:56 PM IST

కొత్తగా విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్ల రేట్లు భారీగా ఉన్నాయి. వాటి డిజైన్లు కూడా అట్రాక్టివ్ గా లేవు.. ఈ తరుణంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్లను (Second Hand Phone) కొనడానికి క్రేజ్ పెరిగింది. తక్కువ కాలం వాడిన.. తక్కువ డ్యామేజ్ అయిన స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇటువంటి టైంలో సెకండ్ హ్యాండ్ ఫోన్లను(Second Hand Phone) కొనే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. ఐఎంఈఐ చెక్‌

సెకండ్ హ్యాండ్ ఫోన్‌ ను కొనే ముందు.. అది బ్లాక్‌ లిస్ట్‌లో ఉందేమో చెక్‌ చేసుకోవాలి. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌లను ఉపయోగించడం చట్టరీత్యా నేరం. ఆ ఫోన్ 15 అంకెల ఐఎమ్‌ఈఐ నెంబర్‌ను తీసుకొని దాన్ని imei.info వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ చేయగానే.. ఆ ఫోన్ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందా లేదా అనేది తెలిసిపోతుంది.

2. హార్డ్‌వేర్‌ చెక్‌

మీరు కొనబోతున్న సెకండ్ హ్యాండ్ ఫోన్ హార్డ్‌వేర్‌ ను తప్పకుండా చెక్‌ చేయండి. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి “ఫోన్‌ డాక్టర్‌ ప్లస్‌” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. దాని ద్వారా ఫోన్‌లో ఏమైనా హార్డ్‌ వేర్‌ ప్రాబ్లమ్స్‌ ఉంటే తెలుసుకోవచ్చు.

3. బ్యాటరీ చెక్

సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనే ముందు దాని బ్యాటరీని తప్పనిసరిగా చెక్ చేయండి. బ్యాటరీ పనితీరును కూడా డాక్టర్‌ ప్లస్‌ యాప్‌లోనే చెక్ చేయొచ్చు. బ్యాటరీ టెస్ట్‌ను రన్‌ చేస్తే బ్యాటరీ లైఫ్‌ ఎలా ఉందో మీకు ఈజీగా తెలిసిపోతుంది.

4. బిల్ చెక్

మీరు కొనాలని భావించే సెకండ్ హ్యాండ్ ఫోన్ యొక్క బిల్లు రసీదు (ఇన్ వాయిస్) కోసం విక్రేతను తప్పక అడగండి. ఒకవేళ ఆన్‌లైన్ బిల్లులు ఇస్తే.. అవి ఏ రూపంలోనూ సవరించబడలేదని లేదా మార్చబడలేదని నిర్ధారించుకోవడానికి ఫోన్ ను ఆర్డర్ చేసిన ప్లాట్‌ఫారమ్‌ లో ఒకసారి నేరుగా చెక్ చేయండి. ఫోన్ బాక్స్ ను కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. దొంగిలించబడిన ఫోన్‌లను కొనుగోలు చేయకూడదు.

5. “ఇంపోర్ట్” చెక్

మీరు ఫారిన్ నుంచి దిగుమతి చేసుకున్న సెకండ్ హ్యాండ్ ఫోన్‌ని కొనుగోలు చేస్తున్నారా? అయితే అది అన్‌లాక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోండి. అది టెలికాం నెట్‌వర్క్ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందో లేదో నిర్ధారించుకోండి. అది మీ టెలికాం క్యారియర్‌తో పని చేస్తుందని కన్ఫామ్ చేసుకోండి. ఆ ఫోన్ కు అంతర్జాతీయ వ్యారంటీ ఉందా? మీ దేశంలో దాని విడి భాగాలు దొరుకుతాయా ? అనే సమాచారాన్ని తెలుసుకోండి. మీ దేశంలో విక్రయించని ఫోన్‌ను కొంటె .. అది రిపేరింగ్ కు వస్తే రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది.

also read : Mobile Phone Tracking System: మొబైల్ ఫోన్ పోయిందా.. అయితే అసలు భయపడకండి.. మే 17 నుంచి కొత్త ట్రాకింగ్ సిస్టమ్?

6. యాక్సెసరీస్ చెక్

ఆ సెకండ్ హ్యాండ్ ఫోన్ తో పాటు పవర్ బ్యాంక్, USB కేబుల్. మైక్రో SD కార్డ్, హెడ్‌ఫోన్‌లు వంటివి ఉంటే తీసుకోండి. తీసుకునే ముందు వాటిని చెక్ చేసుకోండి. పని చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకోండి .

7. వ్యారంటీ చెక్

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు దాని వ్యారంటీ గడువు ఇంకా ఉందా లేదా చూసుకోండి. ఆ ఫోన్ కొని ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసుకోండి. వ్యారంటీ ఉన్న ఫోన్‌లను కొనడమే బెస్ట్. వ్యారంటీ కార్డులు తీసుకొని భద్రపర్చుకోండి. ఫోన్ కు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే .. ఇది హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.

8. ఫిజికల్ చెక్

ఫోన్‌ చూడటానికి ఎలా ఉంది ? ఏమైనా డ్యామేజ్ లు కనిపిస్తున్నాయా ? అనేది తప్పకుండా చూసుకోవాలి. గీతలు, పగుళ్లు ఏమైనా ఉన్నాయో చూడండి. డిస్‌ప్లే, బాడీ, బటన్‌లు, కెమెరాలను పరిశీలించండి. కెమెరా లెన్స్‌పై గీతలు, తక్కువ వెలుతురులో ఫోటోలు తీస్తే క్వాలిటీ ఎలా ఉంది అనే విషయాలను కూడా చెక్ చేయాలి. ఫోన్ ఫ్రేమ్ ,
పవర్, వాల్యూమ్ బటన్‌లను తనిఖీ చేయండి. ఫోన్ ప్యానెల్ నకిలీదా .. అసెంబ్లింగ్ చేశారా అనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. డిస్‌ప్లేను చెక్ చేస్తున్నప్పుడు, ఫోన్ నుంచి స్క్రీన్ ప్రొటెక్టర్‌ను తప్పకుండ తీసేయాలి.

9. సిమ్ చెక్

ఫోన్‌తో పాటు ఛార్జింగ్ కేబుల్‌ని పరీక్షించాలి. మీ పవర్ బ్యాంక్‌ని తీసి, ఫోన్‌ని కేబుల్ ద్వారా ప్లగ్ చేసి, అది బాగా ఛార్జింగ్ అవుతుందో లేదో చూడండి. అందుబాటులో ఉంటే అందించిన ఛార్జర్‌తో మీరు ఛార్జింగ్ వేగాన్ని తనిఖీ చేయవచ్చు. Ampere లేదా AccuBattery వంటి యాప్ ఇన్‌పుట్ కరెంట్, బ్యాటరీ టెంపరేచర్ ను మీకు తెలియజేస్తుంది.
ఆ తర్వాత SIM కార్డ్‌ని ఫోన్ స్లాట్ లోకి చొప్పించి.. ఫోన్ కాల్ చేయగలదా లేదా అనేది పరిశీలించండి. మైక్రో SD కార్డ్ పోర్ట్ (అందుబాటులో ఉంటే), ఫోన్ సపోర్ట్ చేసే ఇయర్‌ఫోన్‌ల వంటి ఇతర ఉపకరణాలను పరీక్షించండి.

10. సౌండ్ చెక్

ఫోన్ లోని స్పీకర్లు, ఇయర్‌ పీస్ ఎలా ఉన్నాయో చూడండి. సౌండ్ క్వాలిటీ సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోండి. మైక్రోఫోన్, వెనుక కెమెరాలు, Wifi, బ్లూటూత్, GPS మొదలైనవి పరిశీలించండి, కాల్ ఫంక్షన్, కంపాస్ సెన్సార్ లను టెస్ట్ చేయండి.