Mobile Phone Tracking System: మొబైల్ ఫోన్ పోయిందా.. అయితే అసలు భయపడకండి.. మే 17 నుంచి కొత్త ట్రాకింగ్ సిస్టమ్?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ని వినియోగిస్తున్నారు. సిటీలలో వాళ్ళు మాత్రమే కాకుండా పల్లెటూర్లలో ఉన్నవ

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 07:32 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ని వినియోగిస్తున్నారు. సిటీలలో వాళ్ళు మాత్రమే కాకుండా పల్లెటూర్లలో ఉన్నవారు కూడా స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. కాగా రాను రాను ఈ స్మార్ట్ ఫోన్ ల.వినియోగం పెరగడంతో స్మార్ట్ ఫోన్ ల ధరలు కూడా పెరుగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ ల దొంగతనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు పోయాయి అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. తరువాత పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగలేక వాటిపైన ఆశలు వదిలేసుకుంటున్నారు. అయితే ఖరీదైన మొబైల్ ఫోన్లు వినియోగించే వారి పరిస్థితి కూడా ఒక విధంగా ఇలాగే ఉంది అని చెప్పవచ్చు.

అయితే స్మార్ట్ ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత ఏం చేయాలి అన్నది చాలామందికి తెలియదు. ఇది ఒకవేళ స్మార్ట్ ఫోన్ పోయింది అంతే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈనెల అనగానే 17వ తేదీన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రాకింగ్ సిస్టం భారతదేశం అంతటా అమలులోకి రానుంది. పోయిన మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేసి బ్లాక్ చేసేందుకు కొత్త సిస్టం అందుబాటులోకి రాబోతోంది అని ప్రభుత్వం సీనియర్ అధికారి తాజాగా వెళ్లడించారు. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి మ్యాట్రిక్స్ అభివృద్ధి చేసిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వ్యవస్థను దేశం మొత్తం మే 17 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే సీడాట్ సీఈఓ రాజకుమార్ ఉపాధ్యాయ్ మాత్రం ఇంకా తేదీని ద్రువీకరించలేదు.

ప్రస్తుతం ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వ్యవస్థను ఢిల్లీ,మహారాష్ట్ర, కర్ణాటక,నార్త్, ఈస్ట్ రీజియన్ లతో సహా కొన్ని టెలికాం సర్కిల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ త్రైమాసికంలో దేశ మొత్తం ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది అని రాజ్ కుమార్ ఉపాధ్యాయ తెలిపారు. సి డాట్ అన్ని టెలికం నెట్వర్క్లలో క్లోనింగ్ చేయబడిన మొబైల్ ఫోన్లో వినియోగాన్ని తనకి చేసేలా ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో విక్రయించే మొబైల్ ఫోన్ లలో IMEI 15 అంకెల ప్రత్యేక ఐడెంటిటీ నెంబర్ ను ముందే బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రతి మొబైల్ నెట్వర్క్ ఈ నెంబర్ ను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఏదైనా అనధికారిక మొబైల్ నెట్వర్క్ పరిధిలోకి వస్తే వెంటనే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వ్యవస్థ ద్వారా గుర్తించగలుగుతాయి. ఈ వ్యవస్థ ద్వారా ఐఎంఈఐ నెంబర్ మొబైల్ నెంబర్ లతో అనుసంధానించబడి ఉంటుంది.