Complaints Against 12 MLAs: 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Written By:
  • Updated On - January 7, 2023 / 10:08 AM IST

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) సంచలన నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ (Congress) రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే దిశగా సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై (12 MLAs) టీ కాంగ్రెస్ నేతలు మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పలువురు ముఖ్య నేతలు పూర్తి వివరాలను పోలీసులకు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చేకూరిన ఆర్థిక లాభాలపై దర్యాప్తు చేయాలని కోరారు. వారు అమ్ముడు పోవడం వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి, భట్టి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం ఇతర నేతలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశారు.

Also Read: 11 Terrorists Killed: 11 మంది ఉగ్రవాదులు హతం

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 19 స్థానాల్లో విజయం సాధించింది. హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన భార్యను హుజూర్‌నగర్‌ నుంచి పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో పద్మావతి రెడ్డి ఓడిపోవడంతో.. అసెంబ్లీ కాంగ్రెస్ బలం 18కి పడిపోయింది. అయితే 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మహశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్‌బీనగర్‌కు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వారందరిపై టీపీసీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.