CM KCR : `వ‌రి`కంబంపై తెలంగాణ సీఎం కేసీఆర్

`ఎద్దు ఏడ్చిన నేల పండ‌దు..రైతు శోకించిన రాజ్యం నిల‌బ‌డ‌దు..`అని పెద్ద‌లు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు.

  • Written By:
  • Updated On - November 13, 2021 / 03:46 PM IST

`ఎద్దు ఏడ్చిన నేల పండ‌దు..రైతు శోకించిన రాజ్యం నిల‌బ‌డ‌దు..`అని పెద్ద‌లు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. పండించిన పంట‌ను అమ్ముకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు `ఫ‌స్ట్ కం ఫ‌స్ట్‌` విధానం పెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ఉసురు పోసుకుంటోంది. దేశంలోనే నెంబ‌ర్ 1 రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ స‌ర్కార్, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌లేక‌పోవ‌డం చేత‌గానిత‌నం అనుకోవాలా? నిధులు స‌మీకరించ‌లేద‌న‌కోవాలా? రైతుల ప‌ట్ల నిర్ల‌‌క్ష్య‌మ‌నుకోవాలా? నా తెలంగాణ కోటి ఎక‌రాల మాగాణ అన్న కేసీఆర్ , కేవ‌లం 64 ల‌క్ష‌ల ఎక‌రాల మాగాణకే స‌మాధానం చెప్ప‌లేక‌పోవ‌డం కేసీఆర్ చేత‌గానిత‌నంగా కింద తీసుకోవాల‌ని ప్ర‌త్య‌ర్థులు అన‌డాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేం.మామిడి బీరయ్య తన వరి పంటను విక్రయించడానికి 200 మంది రైతులతో కలిసి రెండు వారాలుగా క్యూలో నిల‌బ‌డి ఉండగా, నవంబర్ 5 న తన వ‌రి పంట బస్తాలపై కుప్పకూలిపోయి మరణించాడు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఐలాపూర్‌ గ్రామానికి చెందిన 57 ఏళ్ల రైతు గుండెపోటుకు గురయ్యాడు. మూడు ట్రాక్టర్ల వరి ధాన్యం, సుమారు 60 బస్తాలతో లింగంపేట కేంద్రానికి బీరయ్య వెళ్లాడ‌ని అత‌ని పెద్ద కుమారుడు రాజేందర్ తెలిపాడు.

“ప్ర‌తి రోజు మాదిరిగా [నవంబర్ 5] ఉదయం అతని మొబైల్‌కి రాజేంద‌ర్ పదేపదే కాల్ చేసాడు. తండ్రి వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సెంటర్‌కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలని అమ్మను అడిగాడు. తండ్రి వరి కుప్పల మీద శవమై పడి ఉండడాన్ని చూసి అమ్మ ఏడ్వ‌డం చూసి త‌ట్టుకోలేక‌పోయాన‌ని రాజేందర్ అన్నాడు.ఇలా చ‌నిపోయిన రైతుల‌కు తెలంగాణ రైతు భీమా పథకం కింద వాళ్ల‌ కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ఇస్తుంది. పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న భూమిని కలిగి ఉన్న రైతులకే ఈ ప‌థ‌కం పరిమితం చేయబడింది. రాష్ట్రంలోని 18-59 ఏళ్ల మధ్య ఉన్న మొత్తం 31 లక్షల మంది రైతులకు ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేస్తున్నారు. అందు కోసం అర్హ‌త ఉన్న రైతుల కోసం చంద్రశేఖర్ రావు ప్రభుత్వం రూ. 3,200 వార్షిక ప్రీమియం చెల్లిస్తోంది. అయితే, బీరయ్య కౌలు రైతు. అతని కుటుంబానికి ఈ మొత్తం అందుతుందనే అనుమానం ఉంది.

Also Read : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….

వరి కొనుగోలు కేంద్రాల వద్దకు ముందుగా వచ్చిన రైతుల‌కు ముందుగా టోకెన్లు జారీ చేస్తారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 6,500 వరి కొనుగోలు కేంద్రాలలో, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 340 కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. వర్షాలకు త‌డ‌వ‌డం కార‌ణంగా ధాన్యం దెబ్బతినడం కార‌ణంగా వ‌రిని అమ్ముకోవ‌డానికి రైతులు తొంద‌ర ప‌డ్డారు. అందుకే, రైతులు చాలా రోజులుగా టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు.
బీరయ్య నివసించే ఐలాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, అతను తన పంటను పక్కనే ఉన్న లింగంపేటలో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.బీరయ్య మృతి చెందిన కొద్ది రోజులకే అదే జిల్లా బాన్సువాడ మండలం హనుమాజీపేటకు చెందిన శంకరయ్య అనే మరో రైతు తన వరి పొలంలో శవమై కనిపించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడ‌ని భావిస్తున్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఏకంగా వరికోతపై ఆంక్షలు విధించడంతో శంకరయ్య ఆందోళ‌న చెందాడు. వరి పంట‌ను కోయడానికి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది వెర‌సి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌‌డ్డాడు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ఎస్.

మల్లా రెడ్డి ఆయ‌న మ‌ర‌ణంపై మాట్లాడుతూ “అప్పుల ఊబిలో కూరుకుపోవడం, రుణదాతల ఒత్తిడి, పంట‌ను అమ్ముకోలేమ‌ని శంకరయ్య ప్రాణం తీసుకున్నాడ‌ని చెప్పాడు.

ఇదిలావుండగా, రైతుల నుంచి ఆహార ధాన్యాల సేకరణలో ఎన్డీయే ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని రాష్ట్రవ్యాప్త నిరసనలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోర‌డం రైతుల మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ గా ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)కి ధాన్యం సేకరణ బాధ్యత ఉంది. కానీ, కేసీఆర్ డిమాండ్లు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌తో ఎఫ్‌సీఐ కొంత మేర‌కు కొనుగోలు చేసింది.’ఒక దేశం ఒక మార్కెట్’ లక్ష్యంతో, దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను రైతులు విక్రయించుకునేలా చ‌ట్టాల‌ను మోడీ స‌ర్కార్ త‌యారు చేసింది. ప్ర‌భుత్వ‌ యాజమాన్యంలోని ఏజెన్సీలను సేకరణ పరిధి నుండి తొలగించే ప్రయత్నాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ చ‌ట్టాల‌కు పార్లమెంట్‌లో కేసీఆర్ పార్టీ వ్యతిరేకించినప్పటికీ, ఆ మేర‌కు అసెంబ్లీ తీర్మానం చేయాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు.హుజూరాబాద్‌లో ఇటీవల ముగిసిన ఉప ఎన్నికలో ఎన్నికల ఎదురుదెబ్బతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. అదే స‌మ‌యంలో ఎఫ్‌సిఐ తన సేకరణ పరిమితి ఈసారి 60 లక్షల టన్నులు దాటదని చెప్పేసింది. ఖరీఫ్ సీజన్‌లో పారా బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయబోమని, మార్కెట్‌లో నిర్దిష్ట రకానికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది.FCI యొక్క సేకరణ పరిమితులను దృష్టిలో ఉంచుకుని, కేసీఆర్ వరి సాగుపై నిషేధం విధించారు, రైతులు ప్రత్యామ్నాయ పంట‌ల వైపు వెళ్లాలని కోరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

రైతుల నుంచి చివరి గింజ వ‌ర‌కు సేకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన కేసీఆర్ రివ‌ర్స్ అయ్యాడు. దాని తోడు గత రెండేళ్లలో పంటలు బాగా పండడంతో ఆయన మాట నిలబెట్టుకోవడం అసాధ్యంగా మారింది.
కేసీఆర్ ప్రభుత్వం గత ఏడేళ్లలో కాళేశ్వరం, దేవాదుల వంటి భారీ డ్యామ్‌లను నిర్మించి సాగునీటిని మెరుగుపరిచింది, అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మరియు నగదు ప్రోత్సాహక పథకం, రైతు బంధు అందించింది. రాష్ట్రాన్ని కోటి ఎకరాల సారవంతమైన రాష్ట్రంగా మార్చాలని కేసీఆర్ ఆకాంక్షించారు. నీటిపారుదల కాలువలు మరియు బోరు బావుల కింద వరి విస్తీర్ణం 12 లక్షల ఎకరాల నుండి 64 లక్షల ఎకరాలకు పెరిగింది. ఒక సంవత్సరంలో వరి ఉత్పత్తి 2.5 కోట్ల టన్నులకు చేరుకుంది.

“FCI తన నిబద్ధత ప్రకారం రాష్ట్రం నుండి మొత్తం 2.5 కోట్ల టన్నుల ఉత్పత్తిలో 60 లక్షల టన్నులను సేక‌రించ‌డానికి అంగీక‌రించింది. స్వీయ-వినియోగం కోసం రాష్ట్రంలో మరో 25 లక్షల టన్నులను అవ‌స‌రం. ఇంకా మిగిలిన మరో 65 లక్షల టన్నులు ఎవ‌రు కొనుగోలు చేస్తార‌నే ప్ర‌శ్న వ‌స్తుంది.

వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికల్లో హేతుబద్ధత, ముందస్తు ఆలోచన లేదని కేంద్రానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు అంటున్నారు. రైతులు తక్కువ ఉత్పత్తి ఖర్చుతో పండే పంటల వైపు మ‌ళ్ల‌డానికి చాలా సమయం ప‌డుతుందంటున్నారు. తెలంగాణలో కిలో బియ్యం ఉత్పత్తి వ్యయం రూ.39గా ఉంద‌ని ఆయన అంచ‌నా వేస్తున్నాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌రి ధాన్యం వేసిన‌ప్ప‌టికీ గిట్టుబాటు ధ‌ర చాలా క‌ష్టంగా మారుతుంద‌నే విష‌యం అంద‌రూ గుర్తించుకోవాలి.

Also Read : కావేరిపై `డీకే ` మార్క్ పాద‌యాత్ర‌