Ind Vs Ireland: తొలి టీ ట్వంటీలో భారత్ ఘన విజయం

ఐర్లాండ్ టూర్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 09:01 AM IST

ఐర్లాండ్ టూర్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. యువ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ తొలి టీ ట్వంటీలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణిస్తే…బ్యాటింగ్ లో దీపక్ హుడా, కెప్టెన్ హర్ధిక్ పాండ్య ఆకట్టుకున్నారు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 12 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ 108 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ బ్యాటింగ్ లో టెక్టార్ ఒక్కడే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టక్కర్ 18 రన్స్ మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.భారత బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, హార్ధిక్, ఆవేశ్ ఖాన్ తలో ఒక్క వికెట్ సాధించాడు. అరంగేట్ర బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కేవలం ఓకే ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చాడు.

109 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ భారత్ కు ఓపెనర్లు దీపక్ హుడా, ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని అందించారు. సౌతాఫ్రికాతో సిరీస్ లో రాణించిన ఇషాన్ ఈ మ్యాచ్ లో 11 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడో స్థానంలో దిగిన సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయినప్పటికీ దీపక్ తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్య ధాటిగా ఆడాడు. హర్థిక్ 12 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 24 పరుగులు చేశాడు. విజయానికి చేరువలో అతడు ఔట్ అయినా దీపక్ హుడా సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ విజయాన్ని పూర్తి చేశాడు. దీపక్ జోరుతో భారత్ మరో 16 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేదించింది. దీపక్ హుడా 29 బంతుల్లోనే 47 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. స్పిన్నర్ చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీరీస్ లో రెండో మ్యాచ్ బుధవారం డబ్లిన్ లోనే జరుగుతుంది.