CSK vs SRH:సీజన్ లో తొలి గెలుపు ఎవరికో ?

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 9న మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. మహారాష్ట్రలోని డీ వై పాటిల్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడనున్నాయి.

  • Written By:
  • Updated On - April 9, 2022 / 02:21 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 9న మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. మహారాష్ట్రలోని డీ వై పాటిల్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడనున్నాయి. శనివారం సాయంత్రం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోమూడింట్లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మ్యాచు లో కూడా ఎలాగైనా గెలవాలని యోచిస్తోంది. ఇక మరోవైపు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో రెండింట్లో పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి గెలుపు బోణీ కొట్టాలని చూస్తోంది.
ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో మొయిన్ అలీ మిడిల్ ఆర్డర్ లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా లోయర్ ఆర్డర్ లో శివమ్ దూబే, ఎంఎస్ ధోని బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికొస్తే.. రాజ్ హంగర్గేకర్, మహేష్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు..

అలాగే ఈ మ్యాచ్ లో కేన్ విలియం సన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టుని పరిశీలిస్తే.. అభిషేక్ శర్మ , కేన్ విలియమ్సన్ ఓపెనర్లుగా రానుండగా .. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి, మిడిల్ ఆర్డర్ లో నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ లోయర్ ఆర్డర్ లో అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు..
అలాగే ఈ మ్యాచ్ జరగనున్న డీవై పాటిల్ పిచ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు. పిచ్ పై బౌన్స్ ఉండటంతో మ్యాచ్ ఆరంభంలో బౌలర్లు చెలరేగే అవకాశం ఉంది.