Viral Video : బటర్ చికెన్ ఐస్ క్రీం .. ఒక చెఫ్ ప్రయోగం.. నెటిజన్స్ విస్మయం!!

"ఐస్ క్రీంలందు ఈ ఐస్ క్రీమ్ వేరయా" అని నెటిజన్స్ చెబుతున్నారు. దాని టేస్ట్ వేరప్ప అని లొట్టలు వేస్తున్నారు. ఆ

  • Written By:
  • Publish Date - October 2, 2022 / 07:15 AM IST

“ఐస్ క్రీంలందు ఈ ఐస్ క్రీమ్ వేరయా” అని నెటిజన్స్ చెబుతున్నారు. దాని టేస్ట్ వేరప్ప అని లొట్టలు వేస్తున్నారు. ఆ ఐస్ క్రీమ్ డెడ్లీ కాంబినేషన్ రెసిపీ చూసి ఇంకొందరు రగిలిపోతున్నారు.ఇంతకీ ఆ కొత్త రకం ఐస్ క్రీమ్ ఏమిటో అని ఆలోచిస్తున్నారా? అది..బటర్ చికెన్ ఐస్ క్రీం !! దాన్ని తయారు చేస్తున్న, వడ్డిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ దాన్ని చూసి ఒకసారి లొట్టలు వేయండి.

ఐస్‌క్రీంలో ఎన్నో వెరైటీలుంటాయి.ఫ్లేవర్స్‌ ఉంటాయి. బట్టర్‌ స్కాచ్‌, స్ట్రాబెర్రీ, కోన్‌, చాక్లెట్‌.. వంటివన్నీ మీకు తెలుసు.. మరి బటర్ చికెన్ ఐస్ క్రీం ఎప్పుడైనా తిన్నారా ? ఇప్పుడు ఈ కొత్త ఐస్‌క్రీం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి.

 

ఢిల్లీలోని అలోఫ్ట్ ఏరోసిటీలో ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి వింతైన వంటకం తయారుచేసి కస్టమర్‌కు అందించాడు.వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చెఫ్ బటర్‌ చికెన్‌ ఐస్‌క్రీం ఎలా తయారుచేస్తున్నాడో మనం చూడవచ్చు. ముందుగా ఒక కప్పులో బటర్ చికెన్ ప్యూరీని అందిస్తాడు. ఆతరువాత అదనపు రుచి, మసాలా టేస్ట్‌ వచ్చేందుకు దానిపై పుదీనా చట్నీ టాప్‌ చేస్తాడు. వామ్మో.. ఇదేం కాంబినేషన్‌ ! ఫుడ్‌ వూడిండియా పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహార ప్రియులు, ముఖ్యంగా ఐస్ క్రీం లవర్లు ఈ రెసిపీ చూసి షాక్ అవుతున్నారు. ‘ఈ డెడ్లీ కాంబినేషన్‌ ఎంట్రా బాబూ.. వాంతి వస్తోంది.. వీడు కచ్చితంగా నరకానికే పోతాడు’ అంటూ తీరొక్క కామెంట్లు చేస్తున్నారు.