Komatireddy: విద్యార్థులు ఉద్యోగ సాధనతో పాటు కమ్యూనికేషన్లు డెవలప్ చేసుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 11:31 PM IST

Komatireddy: ఇవ్వాల నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్, టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళలో విశిష్ట అతిధిగా పాల్గొన్న మంత్రి విద్యార్థులకు, నిరుద్యోగులకు మార్గానిర్దేశనం చేశారు. గత ప్రభుత్వ నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాల మూలంగా తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడ్డారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహించిన ప్రతి పరీక్ష లీకులు చేసి నిరుద్యోగుల ఉసురు పోసుకుందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల కల్పన కోసం నిరంతరం శ్రమిస్తున్నదని అయన తెలిపారు. యువత ఉద్యోగాలు లేక కుటుంబాలకి భారం కాకుండా ఉద్యోగాలు సాధించాలని.. మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ మీకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని అయన నిరుద్యోగులకు భరోసా కల్పించారు. 127 కంపెనీలు పాల్గొన్న జాబ్ మేళా ద్వారా ప్రతి ఒక్కరు జాబ్ సాధించాలని అయన ఆకాంక్షించారు. విద్యార్థులు, యువత ఈ ఉద్యోగ సాధనతో పాటు కమ్యూనికేషన్లు డెవలప్ చేసుకోవాలని సూచించారు. రాబోయే మే నెలలో మరోసారి జాబ్ మేళా నిర్వహిస్తాం.. ఈ జాబ్ మేళలో మిగిలినవారికి రాబోయే జాబ్ మేళలో అవకాశం కల్పిస్తామని చెప్పారు.