Kerala: పాములకు నిలయంగా మారిన కేరళ గవర్నమెంట్ ఆస్పత్రి

  • Written By:
  • Updated On - June 21, 2023 / 04:18 PM IST

కేరళలోని మలప్పురం జిల్లాలోని పెరింతల్‌మన్నలోని స్టేట్‌ రన్‌ డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌లోని సర్జికల్‌ వార్డులో 10 నాగుపాము పిల్లలు కనిపించడంతో ఆ వార్డును మూసివేశారు. మూడు రోజుల గ్యాప్‌లో నాగుపాము పిల్ల దొరికింది. వార్డులో ఉన్న ఎనిమిది మంది రోగులను ఆసుపత్రిలోని సమీపంలోని మెడికల్ వార్డుకు తరలించారు.

సర్జికల్ వార్డు ఆవరణ పొదలతో నిండిపోయి, వార్డు నేలపై కూడా ఫ్లోర్ విరిగిపోయింది. దీని ద్వారా పాములు లోపలికి వస్తున్నాయని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కన్నూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పే వార్డులో నేలపై నిద్రిస్తున్న 55 ఏళ్ల మహిళ, గర్భవతి అయిన తన కుమార్తెతో పాటు పాము కాటుకు గురైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.