Site icon HashtagU Telugu

Fraudsters: ఫేక్ ఐడీల తయారీకి ఆధార్ లూప్ హోల్స్ ను వాడుకుంటున్న మోసగాళ్ళు.. ఢిల్లీలో బండారం బట్టబయలు

Fraudsters Using Aadhaar Loop Holes To Make Fake Ids.. Bandaram Exposed In Delhi

Fraudsters Using Aadhaar Loop Holes To Make Fake Ids.. Bandaram Exposed In Delhi

ఒక బ్యాంక్ మోసాన్ని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు నివ్వెరపోయే నిజం తెలిసింది. ఆధార్ సిస్టమ్‌ లోని లోటుపాట్లను వాళ్ళు గుర్తించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వ్యవస్థలో దాగిన కొన్ని తీవ్రమైన లొసుగులను వెలుగులోకి తెచ్చారు. ఏ వ్యక్తికి అయినా IDని రూపొందించే టప్పుడు ఆధార్ సిస్టమ్ ఫేషియల్ బయోమెట్రిక్స్ మ్యాచింగ్‌ను నిర్వహించడం లేదని పోలీసులు కనుగొన్నారు అంటూ ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని పబ్లిష్ చేసింది.

వేలిముద్రలు, పేర్లు వేర్వేరు.. ఫోటో ఒక్కటే

ఢిల్లీ పోలీసులు ఆ కేసు గురించి ఇలా వివరించారు.. “ కేసుతో ముడిపడిన చాలా ఆధార్ కార్డులలో ఫోటోగ్రాఫ్‌లు ఒకే వ్యక్తికి చెందినవి వాడారు. కానీ వేరే పేర్లు ఉన్నాయి. వీటికి ఆధార్ డేటాబేస్ నుంచి ధృవీకరన కూడా లభించింది. ఇలా మోసపూరితంగా తయారు చేసిన ఆధార్ కార్డ్స్ తో 12 బ్యాంక్ ఖాతాలు తెరిచారు.

వేలిముద్రలు , పేరు వేర్వేరుగా.. కానీ ఒకే ఫోటో తో ఫేక్ ఆధార్ కార్డులను మోసగాళ్ళు (Fraudsters) తయారు చేశారని తేలింది” అని చెప్పారు. కొంతమంది ఆధార్ అధీకృత ఏజెంట్ల నుంచి పొందిన సిలికాన్‌ వేలిముద్రలు, ఐఆర్‌ఐఎస్‌ స్కాన్‌ ప్రింట్‌ అవుట్‌ల ద్వారా ఈ మోసం చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఆధార్ కన్ఫిగర్ చేసిన ల్యాప్‌టాప్‌లను కూడా ఇందుకోసం వాడారని ఢిల్లీ పోలీసులు విచారణలో వెల్లడించారు.

GPS లోకేషన్ ను ఇలా తప్పించుకొని..

అధీకృత ఏజెంట్లు అధీకృత ప్రభుత్వ కార్యాలయాల నుంచి మాత్రమే పని చేయాలి. వారి GPS సిస్టమ్ ద్వారా ఈవిషయాన్ని రోజూ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ భద్రతను దాటవేయడానికి మోసగాళ్లు కన్ఫిగర్ చేసిన తమ ల్యాప్‌టాప్‌ను 2-3 రోజులకు ఒకసారి నియమిం చబడిన ప్రభుత్వ సంస్థ/కార్యాలయానికి తీసుకెళ్లి, దాన్ని అక్కడి కంప్యూటర్ తో సింక్ చేసుకున్నారు.  దీని ద్వారా తదుపరి 3 రోజుల పాటు ఆ ల్యాప్ ట్యాప్ GPSలో ప్రభుత్వ కార్యాలయం యొక్క లోకేషన్ నే చూపుతుంది. ఈవిధంగా లోకేషన్ అడ్డంకిని మోసగాళ్ళు (Fraudsters) దాటారు.

వేలిముద్రల మధ్య తేడాను గుర్తించలేక..

ఆధార్ సిస్టమ్‌లోని మరో సమస్య ఏమిటంటే.. ఇది సిలికాన్ వేలిముద్ర మరియు ఒక వ్యక్తి యొక్క ప్రత్యక్ష వేలిముద్రల మధ్య తేడాను గుర్తించ లేకపోతుంది.  అధీకృత ఏజెంట్లు ఇచ్చిన సిలికాన్ వేలిముద్రలను ఉపయోగించి యూఐడీఏఐ సిస్టమ్‌లోకి మోసగాళ్లు లాగిన్ అయ్యారు.

IRIS స్కాన్ యొక్క కలర్ ప్రింటౌట్‌ తో లాగిన్

“UIDAI వ్యవస్థ కూడా IRIS స్కాన్ యొక్క స్కాన్ కాపీని గుర్తించలేకపోయింది. IRIS స్కాన్ అనేది బయోమెట్రిక్ ఫీచర్, ఇది ఒక వ్యక్తి జీవించి ఉన్నారా? సిస్టమ్‌కు లాగిన్ చేయడానికి మెషీన్ ముందు కూర్చున్నారో .. లేదో.. దీని ద్వారా నిర్ధారిస్తారు.కానీ మోసగాళ్ళు UIDAI వెబ్ సైట్ లోకి
లాగిన్ చేయడానికి IRIS స్కాన్ యొక్క కలర్ ప్రింటౌట్‌ని ఉపయోగించారు” అని ఢిల్లీ పోలీసులు వివరించారు.

నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి..

పోలీసుల ప్రకారం..మోసగాళ్లు UIDAI డేటాబేస్‌లో 12 సంస్థల ఫోటోగ్రాఫ్‌లను కూడా ఎడిట్/అప్‌లోడ్ చేయగలిగారు. ఆందోళన కలిగించే మరో అంశం ఏమిటంటే, ఆధార్ వ్యవస్థ ఒక వ్యక్తి యొక్క 10 వేలిముద్రలను ఒకే గుర్తింపుగా పరిగణించింది. 10 విభిన్న ప్రత్యేక గుర్తింపులుగా కాకుండా, ఆధార్ అధికారులతో చర్చించిన తర్వాత పోలీసులు కనుగొన్నారు.మోసగాళ్లు ఈ లొసుగుల గురించి తెలుసుకుని, ప్రత్యామ్నాయంగా వేళ్లను ఉంచడం లేదా ఒకరి వేలిముద్రలను మరొకరి వేలిముద్రలను కలపడం ద్వారా అనేక నకిలీ ఐడీలను సృష్టిస్తున్నారు.

Also Read:  Dreams: కలలో ఈ 5 విషయాలను చూస్తే.. ఇక మీకు మంచిరోజుల క్యూ

Exit mobile version