Papala Bhairavadu : రాజకీయ విమర్శనాస్త్రంగా ‘పాపాల భైరవుడు’.. పురాణాల్లో ఏముంది ?

Papala Bhairavadu :  అవినీతికి పాల్పడుతున్న నేతలను, ప్రతిపక్షాన్ని  వేధిస్తున్న నేతలను రాజకీయ నాయకులు విమర్శించేటప్పుడు ఇటీవల కాలంలో ‘పాపాల భైరవుడు’ అనే పదాన్ని తరుచుగా ప్రయోగిస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 24, 2024 / 07:07 AM IST

Papala Bhairavadu :  అవినీతికి పాల్పడుతున్న నేతలను, ప్రతిపక్షాన్ని  వేధిస్తున్న నేతలను రాజకీయ నాయకులు విమర్శించేటప్పుడు ఇటీవల కాలంలో ‘పాపాల భైరవుడు’ అనే పదాన్ని తరుచుగా ప్రయోగిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఇటీవల ఈ పదాన్ని మాజీ సీఎం కేసీఆర్‌‌పైకి ప్రయోగించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇటీవల ఈ పదాన్ని సీఎం జగన్‌పైకి ప్రయోగించారు. రాజకీయ విమర్శనాస్త్రంగా మారిన ఈ పదం నేపథ్యం ఏమిటి ? నిజంగానే పురాణాల్లో పాపాల భైరవుడు ఉన్నాడా ? పాపాల భైరవుడి చరిత్ర ఏమిటి ?  తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

బ్రహ్మకపాలం.. కాశీ.. కాల భైరవుడు

ఎవరిని చూస్తే.. భయంతో వణికిపోతామో, మన బుద్ధి పనిచేయడం మానేస్తుందో ఆ రూపాన్నే భైరవుడు అంటారు. బ్రహ్మదేవుడి గర్వాన్ని అణచివేసేందుకు శివుడు దాల్చిన ఉగ్రరూపం పేరే  కాలభైరవుడు. ఈ రూపంలోనే బ్రహ్మదేవుడికి ఉన్న ఐదుతలల నుంచి ఓ తలను శివుడు తీసేశాడు. అందుకే కాల భైరవుడి చేతిలో బ్రహ్మ కపాలం ఉంటుంది.  ఆ కపాలాన్ని విడిచి పెట్టేందుకు కాల భైరవుడు ససేమిరా అన్నాడు. చివరకు శ్రీ మహావిష్ణువు సూచన మేరకు కాశీలోకి అడుగుపెట్టగానే.. కాల భైరవుడి చేతిలోని  బ్రహ్మ కపాలం కిందపడింది. అలా బ్రహ్మ కపాలం పడిన చోటే కపాలమోచన తీర్థంగా పేరొందింది. నాటి నుంచే కాలభైరవుడు కాశీ క్షేత్రానికి అధిపతిగా మారాడు. కాలభైరవుడి స్వరూపాలుగా వచ్చినవారే అష్టభైరవులు. వారి పేర్లు.. అసితాంగ భైరవుడు, సంహార భైరవుడు  రురు భైరవుడు  క్రోధ భైరవుడు, కపాల భైరవుడు, రుద్ర భైరవుడు, భీషణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు. ఆది భైరవుడు, వృజిన భైరవుడు, మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవులు కూడా ఉన్నారని అంటారు. వీరి గురించే మన పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు విమర్శల కోసం వాడుతున్న పాపాల భైరవుడి పేరుతో ప్రస్తావనేదీ పురాణాల్లో లేదు.

Also Read :Summer Foods : వేడి వేసవిలో మంచి జీర్ణక్రియ కోసం ఏమి తినాలి.?

రాజకీయ నాయకుల తప్పుడు భాష్యం.. 

పాపాల భైరవుడు అనే పురాణాల్లోని పదం కాదు. ఇది తెలుగులో ఒక ‘జాతీయం’గా మారిపోయిన పదం. అత్యంత దుర్మార్గులు, ఎన్నో పాపాలు చేసేవారిని పాపాల భైరవుడితో పోలుస్తున్నారు.  ‘వృజిన భైరవుడు’ అనే పదాన్ని మనం పైన చూశాం కదా.. ‘వృజినం’ అంటే పాపం అని అర్థం. పాపాలను హరించేవాడు కాబట్టి వృజిన భైరవుడు అనే పేరొచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే.. పాపాల భైరవుడు అంటే పాపాలను హరించే భైరవుడు అని అర్థం. మన రాజకీయ నాయకులేమో..  పాపాలు చేసేవాడు అనే అర్థం ఇచ్చేలా పాపాల భైరవుడు పదాన్ని ప్రయోగిస్తున్నారు.

Also Read :CM Yogi : రాహుల్‌ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు.. 6 దశాబ్దాల నుంచి అదే మాట..