Matsya 6000 : ‘మత్స్య 6000’.. మానవసహిత సబ్ మెర్సిబుల్. వచ్చే ఏడాది సెప్టెంబరు-డిసెంబరు లోగా దీనితో ట్రయల్స్ నిర్వహించనున్నారు. తొలిసారిగా 500 మీటర్ల లోతు దాకా మానవరహితంగా వెళ్లేలా ‘మత్స్య 6000’ వాహనాన్ని తయారుచేస్తున్నారు. మనుషులు లేకుండా ఈ ఏడాది సెప్టెంబరులోగా చెన్నై హార్బర్ నుంచి ‘మత్స్య 6000’తో(Matsya 6000) ప్రయోగం చేయనున్నారు. 2026 నుంచి అసలైన పరిశోధనలు మొదలవుతాయి. మనదేశ పరిధిలోని మహాసముద్రాల్లోకి 7,500 మీటర్ల మేర మానవ సహిత సబ్‌మెర్సిబుల్ వాహనాన్ని(Samudrayaan Mission) పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భూ ఉపరితలంతో పోలిస్తే అక్కడ 750 రెట్లు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అంత లోతులో ఒత్తిడిని తట్టుకునేలా ప్రత్యేకంగా టైటానియం మిశ్రమ లోహంతో ‘మత్స్య 6000’ను(Matsya 6000) తయారు చేస్తున్నారు. సముద్రం లోపల 100 మీటర్ల తర్వాత ఎలాంటి విద్యుత్ అయస్కాంత తరంగాలు గానీ, రాడార్, జీపీఎస్ గానీ పనిచేయవు. అందుకోసమే పరిశోధనల కోసం నేరుగా వెళ్లేందుకు ఈ వాహనాన్ని రెడీ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటివరకు ప్రపంచంలో ఏ మానవసహిత సబ్‌మెర్సిబుల్‌కు కూడా పూర్తిస్థాయిలో అధికారిక సర్టిఫికేషన్ లభించలేదు. అయితే తొలిసారిగా ‘మత్స్య 6000’ ఆ రికార్డును సొంతం చేసుకోబోతోంది. నార్వేలోని డీఎన్‌వీ సంస్థ దీనికి ధ్రువీకరణ ఇవ్వబోతోంది. ‘మత్స్య 6000’కు సంబంధించిన డిజైన్లు, పరికరాలు, విడిభాగాలు విడతలవారీగా పరీక్షించనున్నారు. ‘మత్స్య 6000’లో సాంకేతిక లోపాలు, ఇతర పొరపాట్లు జరగకుండా చూడటానికే ఈ విధంగా సర్టిఫికేషన్లను తీసుకుంటున్నారు. వివిధ నాణ్యతా పరీక్షల తర్వాతే ఈ సర్టిఫికేషన్లను జారీ చేస్తారు.
Also Read :Trump : ట్రంప్ మళ్లీ యాక్టివ్.. ప్రత్యేక విమానంలో మిల్వాకీకి
‘మత్స్య 6000’ వాహనం 2.1 మీటర్ల వ్యాసంతో గోళాకారంలో ఉంటుంది. పైలట్, ఇద్దరు శాస్త్రవేత్తలు ఇందులో కూర్చోవచ్చు.లోపలి నుంచే వాహనాన్ని కంట్రోల్ చేయొచ్చు. 5 టన్నుల బరువు ఉండే ఈ వాహనాన్ని తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు. ఇది సముద్రగర్భంలోకి వెళ్లడానికి 3 గంటల టైం, తిరిగి రావడానికి 3 గంటల టైంతో పాటు పరిశోధన కోసం సముద్రగర్భంలో 6 గంటలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ‘మత్స్య 6000’లోని సాంకేతిక వ్యవస్థలు విఫలమైనా.. నీటిలోనే 96 గంటలు ఉండేలా 67 ఆక్సిజన్ సిలిండర్లను ఇందులో అమర్చారు. కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే సాధనాలు కూడా లోపలే అందుబాటులో ఉన్నాయి.