Hema Commission Report : మాలీవుడ్ లో లైంగిక వేధింపులపై హేమ కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టనంది?

ఆమధ్య మలయాళీ చిత్రసీమలో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని దానివల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారంటూ చాలా కథనాలు వెలుగుచూశాయి. దీంతో ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవడానికి 2017లో జస్టిస్ హేమ కమిషన్ ను నియమించింది.

  • Written By:
  • Updated On - April 21, 2022 / 02:24 PM IST

ఆమధ్య మలయాళీ చిత్రసీమలో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని దానివల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారంటూ చాలా కథనాలు వెలుగుచూశాయి. దీంతో ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవడానికి 2017లో జస్టిస్ హేమ కమిషన్ ను నియమించింది. అది కిందటి ఏడాదే రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ దానిని బయటపెట్టబోమంటూ తేల్చేసింది పినరయి ప్రభుత్వం. అయినా ఆ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచాలనుకుంటోంది?

సీనియర్ నటులు శారద, రిటైర్డ్ ప్రభుత్వ అధికారి కేబీ వల్సల కుమారీతో కూడిన జస్టిస్ హేమ కమిషన్ 5000 పేజీల నివేదికను 2019లో ప్రభుత్వానికి అందించింది. చిత్రసీమతోపాటు వినోద పరిశ్రమలో మహిళా నటులతోపాటు ఇతర విభాగాల్లో పనిచేసే మహిళలను లైంగిక వేధింపుల నుంచి కాపాడేలా.. వారి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందులో సూచించింది.

2017లో కదులుతున్న కారులో ఓ మలయాళీ నటిపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డార‌న్న‌ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రముఖ మలయాళీ నటుడు దిలీప్ కూడా ఉన్నారు. అయితే కమిషన్ ఇచ్చిన రిపోర్టులో క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడ్డవారిలో చిత్రసీమలో ప్రముఖలు ఉన్నారని.. అందుకే వారి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కేరళలో సోలార్ స్కామ్ కు సంబంధించి జస్టిస్ జి.శివరాజన్ కమిషన్ 2017 లో ఇచ్చిన రిపోర్టును కేరళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది పినరయి ప్రభుత్వం. దీంతోపాటు పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంచింది. అలాంటప్పుడు హేమ కమిషన్ రిపోర్టును ఎందుకు బయటపెట్టరన్న డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ నివేదిక వ్యవహారం.. కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.