Elephants Drink Liquor: మందేసి.. చుక్కలు చూపించిన ఏనుగుల గుంపు..!

ఒడిషాలోని ఓ ఏనుగుల గుంపు కియోంఝర్‌ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 10, 2022 / 04:21 PM IST

ఒడిషాలోని ఓ ఏనుగుల గుంపు కియోంఝర్‌ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊర్ల మీద పడి భారీగా ఆస్తి నష్టం చేస్తున్నాయి. ఆస్తి నష్టం మాత్రమే కాదు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా కియోంఝర్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 24 ఏనుగుల గుంపు ఏకంగా నాటుసారానే తాగేశాయి.

ఆ నాటుసారా తాగిన తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి. ఏనుగులు అడవిలో పులియబెట్టిన సారాను ఏనుగుల గుంపు తాగేసింది. ఆ తర్వాత మత్తులోకి జారుకుని అక్కడే నిద్రించాయి. సారా కోసం పానీయాన్ని సిద్ధం చేసేందుకు వచ్చిన గ్రామస్తులు ఏనుగులు ఆదమరచి నిద్రపోవడం చూసి షాక్ అయ్యారు. ఆ ఏనుగులను నిద్ర లేపటానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఏనుగులు లేవలేదు.

“మేము మహువా సిద్ధం చేయడానికి ఉదయం 6 గంటలకు అడవిలోకి వెళ్ళాం. అన్ని కుండలు పగిలిపోయి పులియబెట్టిన నీరు కనిపించలేదు. ఏనుగులు నిద్రపోతున్నట్లు కూడా మేము కనుగొన్నాము. ఆ ఏనుగుల గుంపు పులియబెట్టిన నీటిని తాగాయని మాకు అర్థమైంది. మేము ఏనుగులను మేల్కొలపడానికి ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాము. అనంతరం అటవీశాఖకు సమాచారం అందించాం”అని గ్రామస్థుడు నారియా సేథి చెప్పారు. ఏనుగులు ఎంతకీ లేవకపోవడంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి డప్పులు కొట్టి శబ్ధం చేయడంతో ఏనుగులు లేచి అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల గుంపులో 9 మగ ఏనుగులు, 6 ఆడ ఏనుగులు, 9 కూన ఏనుగులు ఉన్నాయి.