Site icon HashtagU Telugu

Mount Abu : మౌంట్ అబూ – అద్భుతాల గుట్ట!!

Mount Abu Mound Of Wonders!!

Mount Abu Mound Of Wonders!!

Mount Abu : రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబూ ఒక వేసవి విడిది (పర్వత ప్రాంతం). ప్రకృతి సౌందర్యం, సౌకర్యవంతమైన వాతావరణం, పచ్చటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆలయాలు, అనేక ధార్మిక కేంద్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. జైనులకు ఈ ప్రాంతం ఒక ప్రముఖ తీర్థ యాత్ర స్థలం. 1220 మీ. ఎత్తు లో గల ఈ పర్వత కేంద్రం ఆరావళి పర్వత శ్రేణుల లోని ఎత్తైన శిఖరం మీద నెలకొని వుంది. మౌంట్ అబూ (Mt. Abu) ప్రముఖ చరిత్ర, పురాతన పురాతత్వ ప్రాంతాలు, అధ్భుతమైన వాతావరణం కల్గి ఉండటం వలన రాజస్థాన్ లోని అతి పెద్ద పర్యాటక ఆకర్షణ లలో ఒకటిగా పరిగణింపబడుతున్నది. ప్రధానంగా వేసవికాలం, వర్షా కాలంలో వేలాదిమంది పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. గత దశాబ్ద౦లొ ఈ పర్వత కేంద్రం ఒక ప్రముఖ వేసవి విడిదిగాను, హనీ మూన్ గమ్యస్థానంగా ప్రజాదరణ పొందింది.

We’re now on WhatsApp. Click to Join.

పురాణాల్లోమౌంట్ అబూ సర్ప దేవత అర్బుద పేరిట ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్య అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుని వాహనమైన నందిని రక్షించడానికి సర్పదేవత కిందికి వచ్చాడు. తర్వాతి కాలంలో ‘అర్బుదారణ్య’ పేరు ‘అబూ పర్వత’ లేదా ‘మౌంట్ అబూ’ గా మారింది. ఇక్కడ గుర్జర్లు లేదా గుజ్జర్లు నివసించేవారని, వారికీ అర్బుద పర్వతాలతో అనుబంధ ముండేదని ఈ ప్రాంతానికి చెందిన చారిత్రిక గ్రంధాలు, శాసనాలలో నమోదు చేయబడింది. మౌంట్ అబూ లో చూడ దగిన ప్రదేశాలు. నక్కి సరస్సు, సన్సెట్ పాయింట్, టోడ్ రాక్, ది సిటీ అఫ్ అబూ రోడ్, ది గురు శిఖర్ పీక్, మౌంట్ అబూ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంత౦లొ చూడవలసిన ప్రధాన ఆకర్షణలు.

అనేక చారిత్రక, ధార్మిక ప్రాముఖ్యత కల్గిన ప్రాంతాలలో ప్రధానంగా దిల్వార జైన దేవాలయాలతో బాటుగా అధర్ దేవి ఆలయం, దూద్ బవోరి, శ్రీ రఘునాథ్ జి దేవాలయం, అచల్ ఘర్ కోట వంటి ప్రాంతాలు కూడ మౌంట్ అబూ లో వున్నాయి. మౌంట్ అబూ చేరుకోవడం మౌంట్ అబూ కు చక్కటి రోడ్డు, రైలు, విమాన సౌకర్యం ఉంది. 185 కి. మీ.ల దూరంలో గల ఉదయ్ పూర్ నుండి వాయు మార్గం ద్వార పర్యాటకులు ఇక్కడికి చేరవచ్చు. సంవత్సరం పొడవున వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వేసవి కాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది.

Also Read:  Wayanad : వాయనాడ్ యొక్క రహస్య సౌందర్యాన్ని కనుగొనడం: కేరళ యొక్క సహజమైన అడవి