Diabetes: షుగర్ పేషెంట్ల కోసం ‘బెస్ట్ బ్రేక్ ఫాస్ట్’ రెసిపీలు!

షుగర్ పేషెంట్లు వారు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించాల్సిందే.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 04:18 PM IST

షుగర్ పేషెంట్లు వారు తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించాల్సిందే. ఎందుకంటే వారు తీసుకునే ఆహారం..ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తంలో గ్లూకోజు పరిమాణం అన్నిసమయాల్లో కంట్రోల్లో ఉండేలా చూసుకోవడం సాధ్యమవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్నే ఎంచుకోవాలి. అధిక కార్బొహైడ్రేట్లు, చక్కెరలు ఉన్న ఆహారానికి దూరండా ఉండాలి. మంచి ప్రొటిన్, ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే…ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. మంచి పోషకాలు కలిగి…రక్తంలో గ్లూకోజ్ కంట్రోల్లో ఉంచే బ్రేక్ ఫాస్ట్ రెసీపీల గురించి తెలుసుకుందాం.

1.మేథి పరాటా:
మేథి పరాటాను మెంతి ఆకులతో తయారు చేస్తారు. ఇందులో గోధుమ పిండి, మెంతి కూర, బీన్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ, నూనె వాడాలి. మెంతుల్లో జీఐ తక్కువ శాతం ఉంటుంది. షుగర్ పేషంట్లకు ఇది మంచి చేస్తుంది. మేథిపరాటాను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఉండటంతోపాటు..మంచి పోషకాలు లభిస్తాయి.

2. బేసన్ మేథి చీలా:
శనగ పిండి, మెంతికూరతో చేసుకుంటారు. ఇందులో మంచి ఫైబర్ తోపాటు..మెగ్నీషీయం తగినంతగా ఉంటుంది. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు నీరు, తగినంత ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, కారం, పచ్చిమిర్చి, ఒక కప్పు మెంతి ఆకులు, నూనె కావాలి. వీటితో బేసన్ మేథి చీలా తయారు చేసుకోవచ్చు.

3. బాయిల్డ్ ఎగ్స్:
ఆమ్లెట్ కంటే ఉడికించి గుడ్డును తీసుకోవడం చాలా మంచిది. నూనె అవసరం ఉండదు.

4.కాలాచానా చాట్:
ఈ చాట్ ను శనగలతో చేస్తారు. ఒక రాత్రంతా శనగలను నానబెట్టి, మర్నాడు ఉదయం వాటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి. వాటికి ఉడికించిన బంగాళాదుంపలు, మసాలాను యాడ్ చేసుకుని తినాలి. ఒక కప్పు శనగలు, అరకప్పు కొత్తిమీర ఆకులు, గ్రీన్ చిల్లీ, తరిగిన ఉల్లిపాయలు, ఒక కప్పు ఉడికించిన బంగాళ దుంపలు, ఉప్పు, చాట్ మసాలా, జీర, కొద్దిగా నిమ్మరసం అవసరం అవుతాయి.

5. రాగి దోశ:
రాగి పిండితో దోశ చేసుకున్నట్లయితే మంచి పోషకాలు అందుతాయి. రక్తంలో గ్లూకోజ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. రాగి, గోధుమ పిండి, మజ్జిగ కలిపి రాత్రంతా నానబెట్టి….తెల్లవారు ఉదయం దోశలా పోసుకుని తినేయాలి.

ఇలా బ్రేక్ ఫాస్ట్ రెసిపీలతో షూగర్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.