Price Hike: వంట గ్యాస్ ధ‌ర‌లు బ్లో ఔట్

సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌పై మ‌రో భారం వేయ‌డానికి మోడీ సిద్ధం అయ్యాడు. ఆయిల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌ను వడ్డించ‌డానికి రంగం సిద్ధం చేశాడు.

  • Written By:
  • Publish Date - November 1, 2021 / 09:29 PM IST

ఢిల్లీ: సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌పై మ‌రో భారం వేయ‌డానికి మోడీ సిద్ధం అయ్యాడు. ఆయిల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌ను వడ్డించ‌డానికి రంగం సిద్ధం చేశాడు. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.268 వరకు న‌వంబ‌ర్ నుంచి పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.264 పెరిగింది. సామాన్యులు వాడే 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను ప్ర‌స్తుతానికి పెంచలేదు. ఢిల్లీలో 14.2 కిలోల నాన్-సబ్సిడీ LPG సిలిండర్ ధర రూ.899.50 వద్ద ఉంది. సబ్సిడీ లేకుండా 14.2 కిలోల సిలిండర్ ధర రూ.15 పెరిగింది.
ఢిల్లీలో ఇప్పుడు సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ ధర రూ.899.50. కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.926, ముంబైలో రూ.899.50. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50గా ఉంది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.2645 పెరిగి రూ.2000.50కి చేరింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.268 పెరిగి రూ.2073.5కి చేరుకుంది. గతంలో దీని ధర రూ.1805.50. ముంబైలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.265 పెంచగా, దాని ధర రూ.1950కి చేరింది. ఇంతకు ముందు ధర రూ.1685. చెన్నైలో సిలిండర్‌కు రూ.1867.5.లు ఉంది. చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.265.50 పెరిగి రూ.2133కి చేరుకుంది. ఇంతకు ముందు దీని ధర రూ.1867.5 గా ఉండేది.
LPG సిలిండర్ ధరను https://iocl.com/Products/IndaneGas.aspx లింక్ తెరిస్తే ఎప్పుడెప్పుడు ధ‌ర‌లు పెరిగాయో తెలుసుకోవ‌డానికి వీలుంది.
ఇండియన్ ఆయిల్ కంపెనీ వినియోగదారుల కోసం కొత్త రకం LPG సిలిండర్‌ను పరిచయం చేసింది. దీని పేరు కాంపోజిట్ సిలిండర్. ఈ సిలిండర్‌ను మూడు అంచెల్లో నిర్మించారు. లోపలి నుండి మొదటి స్థాయి అధిక సాంద్రత కలిగిన పాలిథిలిన్‌తో తయారు చేయబడుతుంది. ఈ లోపలి పొర పాలిమర్‌తో చేసిన ఫైబర్‌గ్లాస్‌తో పూత పూయబడింది. బయటి పొర కూడా HDPEతో తయారు చేయబడింది.
ప్రస్తుతం దేశంలోని 28 నగరాల్లో కాంపోజిట్ సిలిండర్ పంపిణీ చేయబడుతోంది. కాంపోజిట్ సిలిండర్ 5, 10 కిలోల బరువుతో వస్తోంది. ఈ సిలిండర్ దేశంలోని ఇతర నగరాలకు కూడా సరఫరా చేయ‌డ‌నికి రంగం సిద్ధం అయింది. ఏదో ఒక ర‌కంగా ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బు వ‌సూలు చేసే విధానం తీసుకు రావ‌డంలో మోడీ స‌ర్కార్ విజ‌యం సాధిస్తోంది. సో.. మోడీ కోసం మ‌ళ్లీ త్యాగానికి రెడీ అవుదాం.!