Bangladesh – Super Powers : నేడే బంగ్లాదేశ్ పోల్స్.. నాలుగు సూపర్ పవర్స్‌కు ఇంట్రెస్ట్ ఎందుకు ?

Bangladesh - Super Powers : బంగ్లాదేశ్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - January 7, 2024 / 09:05 AM IST

Bangladesh – Super Powers : బంగ్లాదేశ్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తామని ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఎన్నికలను బహిష్కరించింది.  బంగ్లాదేశ్ ఎన్నికలపై ప్రపంచ దేశాల దృష్టి ఉంది. ఈ పోల్స్‌ను భారత్, చైనాలే కాకుండా రష్యా, అమెరికాలు కూడా గమనిస్తున్నాయి. ఈ నాలుగు దేశాలకు బంగ్లాదేశ్ ఎందుకు ముఖ్యమో ఇప్పుడు(Bangladesh – Super Powers) తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

భారత్‌కు బంగ్లాదేశ్ ఎందుకు ముఖ్యమైంది ?

  • భారతదేశానికి బంగ్లాదేశ్‌ భద్రతా సంస్థలు నిరంతరం సహకారం అందిస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం తన దేశంలో భారత వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా భారత్‌తో దాని సంబంధాలను ప్రభావితం చేయబోతున్నాయి.
  • ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని 14 పార్టీల కూటమి ప్రతిపక్ష బీఎన్‌పీ, జమాతే ఇస్లామీలకు వ్యతిరేకంగా నిలబడింది.
  • బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వానికి చాలా కాలంగా భారత్ మద్దతుగా నిలుస్తోంది. ఎందుకంటే ఆ  దేశంలో తీవ్రవాద, ఛాందసవాద మూలాలను అరికట్టడంలో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించింది.
  • ఇస్లామిక్ పార్టీలు అక్కడ  అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్‌లో అరాచకం విస్తరించి భారతదేశ ప్రయోజనాలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అందుకే అవామీ లీగ్ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని భారత్ కోరుకుంటోంది.
  • భారతదేశం కూడా తన ఈశాన్య రాష్ట్రాల భద్రతా ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్‌పై ఆధారపడుతోంది. భారత్‌తో స్నేహాన్ని నిలుపుకునేందుకుగానూ.. భారత ఈశాన్య రాష్ట్రాల్లోకి చొరబడి హింసకు కారణమవుతున్న జిహాదీ సంస్థలపై బంగ్లాదేశ్ సర్కారు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతోంది.
  • మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘లుక్ ఈస్ట్’ అండ్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి బంగ్లాదేశ్ కూడా చాలా ముఖ్యమైనది. ఈ విధానాలలో ప్రాంతీయ అనుసంధానం, డిజిటల్ ఇంటిగ్రేషన్, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన సహకారం భాగాలుగా ఉన్నాయి.
  • రక్షణ దిగుమతుల కోసం బంగ్లాదేశ్‌కు భారత్ 500 మిలియన్ డాలర్ల రుణాన్ని కూడా ఇచ్చింది.

Also Read: Plane Door Horror : ఇండియాలోనూ అలర్ట్.. ‘బోయింగ్‌ 737-9 మ్యాక్స్‌’ విమానాల కలవరం

బంగ్లాదేశ్‌ ప్రతిపక్షాలకు అమెరికా సపోర్ట్

బంగ్లాదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అమెరికా వత్తాసు పలుకుతోంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా విమర్శిస్తోంది. ఢాకాలోని అమెరికా ఎంబసీ ప్రతిపక్షాలను బలోపేతం చేయడంలో బిజీగా ఉంది. బంగ్లాదేశ్‌లోని ఉన్నతాధికారులు, నేతలు, న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తుల వీసాలపై గతేడాది అమెరికా  ఆంక్షలు విధించింది. 2021, 2023 సంవత్సరాల్లో జరిగిన ‘డెమొక్రసీ సమ్మిట్’ నుంచి బంగ్లాదేశ్‌ను ఉద్దేశపూర్వకంగానే అమెరికా దూరంగా ఉంచిందని అంటున్నారు. ఇండో పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే చైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌’లో బంగ్లాదేశ్ కూడా 2016 నుంచే భాగస్వామిగా ఉంది.

Also Read:Uber Flex : ‘ఉబెర్‌ ఫ్లెక్స్‌’.. మీ రైడ్ ధరను మీరే డిసైడ్ చేసుకోవచ్చు

చైనా నుంచి బంగ్లాకు భారీగా అప్పులు

  • చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో బంగ్లాదేశ్ భాగస్వామి.
  • బంగ్లాదేశ్‌లోని రోడ్లు, సొరంగాలు, రైల్వేలు, పవర్ ప్లాంట్లు వంటి అనేక పెద్ద ప్రాజెక్టులకు చైనా నిధులు ఇస్తోంది.
  • బంగ్లాదేశ్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇస్తామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హామీ ఇచ్చారు.
  • చైనా ఇటీవల బంగ్లాదేశ్‌కు రెండు జలాంతర్గాములను విక్రయించింది.

రష్యా.. బంగ్లాదేశ్.. యురేనియం

బంగ్లాదేశ్‌‌పై  రష్యా కూడా ఆసక్తి చూపుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో అక్కడ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పర్యటించారు. ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆయన మద్దతు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో రష్యాకు సాన్నిహిత్యం పెరగడానికి ముఖ్య కారణం యురేనియం. రష్యా కొంతకాలంగా బంగ్లాదేశ్‌కు యురేనియం సరఫరా చేస్తోంది. బంగ్లాదేశ్‌ రూప్‌పూర్‌లో 2400 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. బంగ్లాదేశ్‌లో ఇది మొదటి అణు విద్యుత్ కేంద్రం. ఈ పవర్ ప్లాంట్‌ను రష్యా అణు ఏజెన్సీ రోసాటమ్ సిద్ధం చేస్తోంది. ఈ పవర్ ప్లాంట్ 1.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయగలదు. ఇందుకోసం రష్యా దాదాపు 11 బిలియన్ డాలర్ల రుణం కూడా ఇచ్చింది.