General Elections: సమయానికి ముందే సార్వత్రిక ఎన్నికలొస్తే విపక్షాలు సిద్ధమేనా..?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని అధికార బిజెపి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.

  • Written By:
  • Updated On - September 3, 2023 / 11:33 AM IST

By: డా. ప్రసాదమూర్తి

General Elections: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని అధికార బిజెపి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. దింతో దేశమంతా ఇదే విషయం మీద చర్చ కొనసాగుతోంది. రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నా యి. మేధావులు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అనేక రకాల విశ్లేషణలు చేస్తున్నారు. అందరి మాట ఎలా ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్నాయనేది మనకు అర్థమవుతోంది.

ముంబైలో మూడోసారి సమావేశమైన ప్రతిపక్ష కూటమి, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అసలు ఉద్దేశం ఏమిటో తమకు పూర్తిగా బోధపడినట్టే అన్నట్టు నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు. ముంబైలో రెండు రోజుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో సార్వత్రిక ఎన్ని కలు తొందరలోనే రావచ్చు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోడీసర్కార్ కు విపక్ష నాయకులు ఒక సవాలు విసిరారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఉద్దేశం ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనేదిగా పైకి కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే మాజీ రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనితో దేశానికి విషయం స్పష్టమైపోయింది. అయితే ఇది సాధ్యమా, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం కదా. దానికి పార్లమెంటు ఉభయ సభల నుంచి 60 శాతం, రాష్ట్రాల అసెంబ్లీల ప్రాతినిధ్యం నుంచి 50% ఆమోదం లభించాలి. ఈ విషయం మీద కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం అంత తేలికైన పని కాదు.

అయినా ఒక పని చేయొచ్చు. ఈ ప్రాసెస్ ని ముందుకు తీసుకు వెళుతూ, ఇప్పటికే దేశంలో నాలుగైదు సార్లు జరిగిన ప్రయోగం కనుక, దీన్ని తప్పనిసరిగా అమలులోకి తీసుకు వస్తే దేశం మీద అమితమైన ఎన్ని కల భారం తగ్గుతుందని బిజెపి వాదించవచ్చు. మొత్తం ఈ చర్చ మీద అందరి శక్తీ కేంద్రీక్రీృతమై ఉండవచ్చు. ఇదింత త్వరగా సాధ్యం కాని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలను సమీపంలో జరగనున్న రాష్ట్రాల ఎన్ని కలతో కలిపి చేయడానికి కేంద్రం ముందుకు సాగవచ్చు. అదీ విషయం.

Also Read: Nigar Shaji: ఆదిత్య L1 విజయం వెనుక మహిళా సైంటిస్ట్

ఈ విషయాన్ని దేశం ఎలా అర్థం చేసుకున్నా, ప్రతిపక్షాలు మాత్రం అసలు గుట్టు బోధపరుచుకున్నట్టు వారి మాటల్లోనే అర్థమవుతోంది. ముంబై సమావేశం తర్వాత ఆయా పార్టీల నాయకులు ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్లిపోయారు. అక్కడ మీడియాతో నాయకులు, ప్రతిపక్ష కూటమి INDIA తీసుకున్న నిర్ణయాలను, ఎన్నికల వ్యూహాన్ని మీడియాకు వివరిస్తూ, పార్లమెంట్ పత్ర్యేక సమావేశాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ప్రతిపక్షాల కూటమికి పధ్రాన సూతధ్రారిగా వ్యవహరిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నిర్ధారిత సమయం కంటే ముందే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి మోడీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

ఒకప్పుడు బిజెపితో కలిసి నడిచిన నాయకుడిగా నితీష్ కుమార్ కి బిజెపిలో కొన్ని అంతర్గత శక్తులతో గట్టి పరిచేయాలే ఉన్నాయి. ఆయన అన్నారంటే కచ్చితంగా ఇదే జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వి యాదవ్ కూడా ఇదేమాట మాట్లాడారు. ఒకేదేశం ఒకే ఎన్నిక కాదు, ఒకే దేశం ఒకే ఆదాయం అని కేంద్రపభ్రుత్వం చెప్పొచ్చు కదా అని తేజస్వి యాదవ్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ పదేపదే మోడీ.. ఆదానీల మధ్య బంధాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షాల కూటమి బలపడుతున్న సంకేతాలు కేంద్రంలో అధికార పక్షానికి కొంచెం కంగారు పుట్టించేవిగా ఉన్నాయి. అందుకే నిర్ణీత గడువు లోపే ఎన్ని కలు జరపడానికి కేంద్రం పావులు కదుపుతోందన్న విషయం ప్రతిపక్ష నాయకుల ప్రతిఒక్కరి నోటి నుండి వ్యక్తమవుతోంది.

2023 డిసెంబర్ లోపు తెలంగాణ, రాజస్థాన్, మధ్యపద్రేశ్, చత్తీస్ గడ్, మిజోరం.. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ, అలాగే ఆంధప్రద్రేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ పద్రేశ్ లలో వచ్చే ఏడాదిజూన్ లోపు, 2024 ఆఖరిలో హర్యానా, మహారాష్ట్ర,ఝార్ఖండ్.. ఇలా ఒక సంవత్సరంలో 12 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దేశవ్యా ప్తంగా అన్ని రాష్ట్రాల ఎన్నికలూ, సార్వత్రిక ఎన్నికలూ జమిలిగా సాగించేందుకు ఇప్పటికిప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనలు అంగీకరించకపోవచ్చు. ఆ పక్రియ సాగించడానికి సమయం పట్టవచ్చు. అందుకే 2024 ఫిబవ్రరికల్లా ఈ 12 రాష్ట్రాలతో కలిసి సార్వత్రిక ఎన్నికలు జరిపే ఉద్దేశంలో కేంద్రపభ్రుత్వం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్ష పార్టీలు ఒక సమన్వయ కమిటీ వేసుకొని దాని ద్వారా సీట్ల షేరింగ్ ఒప్పందాన్ని వెంటనే పరిష్కరించుకొని, ఈ నెలాఖరుకల్లా ఎన్నికల పచ్రారానికి యుద్ధంలోకి దిగాలని తీర్మానించుకున్నా యి. మొత్తానికి దేశంలో జమిలి ఎన్నికల మాటేమో గానీ, మోదీ వ్యూహ రచనకు ప్రతిపక్షాల ప్రతివ్యూహ రచన జమిలిగా సాగుతోంది. ఎవరి వ్యూహం ఫలిస్తుందో కాలమే చెప్పాలి.