Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలు కంటిన్యూ.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Gyanvapi Mosque : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తెహ్ఖానా (సెల్లార్) లో  పూజలు నిర్వహించుకునేందుకు హిందువులకు అనుమతులిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. 

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 11:37 AM IST

Gyanvapi Mosque : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తెహ్ఖానా (సెల్లార్) లో  పూజలు నిర్వహించుకునేందుకు హిందువులకు అనుమతులిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది.  జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని ‘వ్యాస్ తెహ్ఖానా’లో హిందువుల ప్రార్థనలు కొనసాగుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ పేర్కొన్నారు. మసీదు కమిటీ పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

  • జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque) సెల్లార్‌లోని ‘వ్యాస్ తెహ్ఖానా’లో పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు గత నెలలోనే ఆర్డర్స్ ఇచ్చింది.
  • జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో 1993 డిసెంబరు వరకు తన తాత సోమనాథ్ వ్యాస్ ప్రార్థనలు చేసేవారని శైలేంద్ర కుమార్ పాఠక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన వారణాసి జిల్లా కోర్టు పై ఉత్తర్వులు జారీ చేసింది.
  • వంశపారంపర్య పూజారిగా పూజలు చేసేందుకు తనను మసీదు తెహ్ఖానాలోకి అనుమతించాలని శైలేంద్ర కుమార్ పాఠక్ చేసిన రిక్వెస్టును కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
  • జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో నాలుగు ‘తెహ్ఖానాలు’ (సెల్లార్లు) ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికీ వ్యాస్ కుటుంబం ఆధీనంలోనే ఉంది.
  • ఇదే వ్యవహారంలో జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు తోసిపుచ్చింది. సెల్లార్‌లో విగ్రహాలు లేవని.. కాబట్టి 1993 వరకు అక్కడ ప్రార్థనలు జరిగిన ఆధారాలు లేవని మసీదు కమిటీ పేర్కొంది.
  • వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ  జ్ఞానవాపి మసీదు కమిటీ  దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
  • సుప్రీంకోర్టు సూచించిన కొద్ది గంటల్లోనే (ఫిబ్రవరి 2న)  మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లింది.
  • ఫిబ్రవరి 15న ఇరు పక్షాలను విచారించిన అలహాబాద్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
  • ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదిక,  మసీదు ప్రాంగణంలో లభ్యమైన హిందూ దేవాలయ అవశేషాలు, ఔరంగజేబు పాలనలో మసీదు నిర్మాణ చరిత్ర వివరాల ఆధారంగా తాజా తీర్పును హైకోర్టు ఇచ్చింది.

Also Read : Free Palestine : పాలస్తీనా కోసం అమెరికా సైనికుడి ఆత్మహత్యాయత్నం