Buggy Tradition : ‘ప్రెసిడెన్షియల్ బగ్గీ’.. అలా ఆగిపోయి, ఇలా మొదలైంది

Buggy Tradition : రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే గుర్రపు బగ్గీ  సంప్రదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రారంభించారు. 

Published By: HashtagU Telugu Desk
Buggy Tradition

Buggy Tradition

Buggy Tradition : రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే గుర్రపు బగ్గీ  సంప్రదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రారంభించారు.  75వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ‘ప్రెసిడెన్షియల్ బగ్గీ’ ఊరేగింపులో భారత రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ ఊరేగింపు కనుల విందుగా జరిగింది.  గుర్రపు బగ్గీ చుట్టూ ఎర్రటి యూనిఫాం ధరించిన అశ్వికా దళ సిబ్బంది పహారాగా ఉన్నారు. ఈ పద్ధతిలో కర్తవ్య పథ్‌లో రాష్ట్రపతి పర్యటించడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఊరేగింపు ముగిసిన అనంతరం భారత జాతీయ జెండాను ముర్ము ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన,  21 -గన్ సెల్యూట్‌ కార్యక్రమం జరిగాయి.  ఆ వెంటనే గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రారంభమైంది.

We’re now on WhatsApp. Click to Join.

1984లో ఇందిరాగాంధీ హత్యతో..

ప్రెసిడెన్షియల్ బగ్గీ (Buggy Tradition) ఊరేగింపు 1984 వరకు ఏటా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగేది. అయితే  1984 అక్టోబరు 31న  అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో 1985 సంవత్సరం రిపబ్లిక్ డే నుంచి భద్రతా కారణాల దృష్ట్యా ప్రెసిడెన్షియల్ బగ్గీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిలిపివేశారు. నాటి నుంచి రాష్ట్రపతిగా ఉన్నవారు  అత్యంత పొడవుగా ఉండే లిమోసిన్ రకం కారులో కర్తవ్య పథ్‌ మీదుగా వెళ్తూ ప్రజలకు అభివాదం చేసేవారు.

Also Read :Husbands Swapping : భర్తలను మార్చుకున్న ఇద్దరు యువతులు.. నాలుగేళ్ల తర్వాత ఏమైందంటే ?

గుర్రపు బగ్గీ చరిత్ర

కర్తవ్య పథ్‌లో రాష్ట్రపతి ఊరేగింపుగా వెళ్లేందుకు వినియోగించే గుర్రపు బగ్గీ బంగారు పూతతో కూడిన అంచులను కలిగి ఉంటుంది.  ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బగ్గీని మన దేశ స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ వైస్రాయ్‌లు వినియోగించేవారు. అనంతర కాలంలో దీన్ని భారత రాష్ట్రపతి భవన్‌లో ఉంచారు.  బ్రిటీష్ పాలనా కాలానికి చెందిన ముద్రలన్నీ చెరిపివేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలోని మోడీ సర్కారు.. బ్రిటీష్ వైస్రాయ్‌ల ఉనికిని గుర్తుచేసే గుర్రపు బగ్గీ సంప్రదాయాన్ని తిరిగి ఆచరణలోకి తేవడం గమనార్హం.

జెండా ఆవిష్కరించిన ముర్ము

మనదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఆగస్టు 15న ఎలాగైతే త్రివర్ణ పతకాలు రెపరెపలాడుతాయో.. జనవరి 26న కూడా అదే స్థాయిలో జాతీయ జెండాలు రెపరెపలాడుతాయి. ఇక మన దేశంలో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగిరిన అనంతరమే దేశంలో ఇతర ప్రాంతాల్లో జెండా వందనం వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఎర్రకోటపై ఆగస్టు 15న ప్రధానమంత్రి జెండా ఎగురవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 26న మాత్రం ఆయన జాతీయ జెండా ఎగరవేయరు. ఎర్రకోట పై ఉన్నప్పటికీ కూడా ఆయన జెండా వందనం వేడుకల్లో మాత్రమే పాల్గొంటారు.

  Last Updated: 26 Jan 2024, 12:40 PM IST