Delhi: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ మరోసారి అవతరించింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు ఇతర నాగరాలున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం

Delhi: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ మరోసారి అవతరించింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు ఇతర నాగరాలున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం 2023లో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ తర్వాత 134 దేశాలలో భారతదేశం మూడవ అధ్వాన్నమైన గాలి నాణ్యత కలిగిన దేశంగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతకుముందు 2022లో భారతదేశం ఎనిమిదో అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ మరోసారి అవతరించింది. మరోవైపు బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించింది. ఢిల్లీ 2018 నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా నిలిచింది.

వాయు కాలుష్యానికి గురికావడం వలన అనేక ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వీటిలో ఆస్తమా, క్యాన్సర్, పక్షవాతం మరియు ఊపిరితిత్తుల వ్యాధులతో సహా మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

Also Read: Eating Fish: చేపలు తినే వారి సంఖ్య 66% నుండి 72.1%కి పెరిగింది