CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్

CAA Decoded : ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019’ ఎట్టకేలకు మన దేశంలో అమల్లోకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 07:43 AM IST

CAA Decoded : ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019’ ఎట్టకేలకు మన దేశంలో అమల్లోకి వచ్చింది. వాస్తవానికి 2019 సంవత్సరంలోనే ‘సీఏఏ-2019’ చట్టం పార్లమెంటు, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందింది. సీఏఏ-2019 చట్ట రూపం దాల్చిన నాలుగేళ్ల తర్వాత… సోమవారం (మార్చి 11న) సాయంత్రం దాని అమలుపై కేంద్ర సర్కారు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్‌లోని టాప్ పాయింట్స్‌ను ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

  • పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడమే సీసీఏ-2019(CAA Decoded) లక్ష్యం. తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వం ఇచ్చేస్తారు.
  • 2014 డిసెంబరు 31 కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు,   పార్సీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.
  • వీరికి పౌరసత్వం మంజూరుకు సంబంధించిన ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
  • పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చినవారికి చట్టపరంగా పౌరసత్వం దక్కనున్నందున వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి.
  • నూతన చట్టం ప్రకారం మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఆరు మతాల వారిని చట్టవ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. ఈ చట్టం కింద ప్రయోజనం పొందడానికి వీలుగా వారిని విదేశీయుల చట్టం- 1946, పాస్‌పోర్ట్‌ (ఎంట్రీ ఇన్‌ టు ఇండియా) చట్టం- 1920 నుంచి మినహాయించారు.

Also Read : Hussainsagar : రేపు హైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..

  • పౌరసత్వం మంజూరుకు 30 జిల్లాల కలెక్టర్లకు, 9 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు ఇదివరకే అధికారాలిచ్చారు.
  • అస్సాం, పశ్చిమబెంగాల్‌లలో సున్నిత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మాత్రం ఏ జిల్లా అధికారులకూ ఇలాంటి అధికారం ఇవ్వలేదు.
  • సీఏఏ కింద భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్‌ నేతృత్వం వహిస్తారు.
  • ఆ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలు ఇక మన దేశంలో ఎక్కడికైనా రాకపోకలు సాగించొచ్చు. ఆస్తులు కొనొచ్చు.
  • మతపరమైన వేధింపులను తట్టుకోలేక  3 దేశాల్లో హింసకు గురవుతూ భారత్‌లో తప్పితే ప్రపంచంలో మరెక్కడా ఆశ్రయం పొందలేనివారికి రక్షణ కల్పించడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్లు కేంద్ర సర్కారు చెబుతోంది.
  • సీఏఏ చట్టం బయటి నుంచి వచ్చినవారికి పౌరసత్వం ఇస్తుందేగానీ.. భారతీయ పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయదు.
  • సాధారణ పరిస్థితుల్లో పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఏళ్లపాటు భారత్‌లో నివసించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పనిచేయాలి.
  • అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం నివాస అర్హతను అయిదేళ్ల కాలానికి కుదించారు. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు.

Also Read :Dharani Portal: ధ‌ర‌ణి ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు