Salt: ఉప్పు తగ్గించాల్సిందే.. లేదంటే ప్రాణాలకే ముప్పు

మన శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు నరాల పనితీరులో ఉప్పు ముఖ్యం. అయితే దాని అధిక వినియోగం అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని

“అకాల మరణాలకు అనారోగ్యకరమైన ఆహారంతో పాటు ఉప్పు (Salt) కూడా కారణం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఉప్పు తీసుకోవడం చాలా పెరిగింది. ఇది గుండె జబ్బులకు దారితీసి.. అకాల మరణాల ముప్పును పెంచుతోంది” అని తాజాగా WHO నివేదిక వెల్లడించింది.2025 నాటికి ఉప్పు వాడకం 30% తగ్గించాలనే లక్ష్యానికి ప్రపంచ దేశాలు దూరంగా ఉన్నాయని WHO ఆందోళన వ్యక్తం చేసింది. WHO సభ్య దేశాలలో 5% మాత్రమే ఉప్పు వినియోగాన్ని తగ్గించాయని పేర్కొంది.

మన శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి మరియు నరాల పనితీరులో ఉప్పు (Salt) ముఖ్యం. అయితే దాని అధిక వినియోగం అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు లో సోడియం ఉంటుంది . అయితే సోడియం గ్లుటామేట్ అనేది ఫాస్ట్ ఫుడ్, చిప్స్, స్నాక్స్, సూప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్ మరియు అనేక ఇతర ఆహారాలలో ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్, చిప్స్, స్నాక్స్, సూప్‌లు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్ అన్నీ సోడియం గ్లుటామేట్‌ను కలిగి ఉంటాయి. వీటిలో ఉప్పు మోతాదు చాలా ఎక్కువ. వీటివల్ల మన ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది.ప్రపంచంలోని ప్రజలు రోజుకు సగటున 10.8 గ్రాముల ఉప్పును వాడుతున్నారు.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు 5 గ్రాముల (ఒక టీస్పూన్) కంటే తక్కువ ఉప్పును సిఫార్సు చేస్తోంది. అయితే ప్రపంచ దేశాల్లో సగటున దాని కంటే రెట్టింపు మోతాదులో ఉప్పును ఉపయోగిస్తున్నారు.అధిక ఉప్పు వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటివి చుట్టుముడుతున్నాయి.

ఎంత ఉప్పు (Salt) వాడాలి?

ఓ సాధారణ మనిషి రోజులో 2400 ఎంజీ ఉప్పును మాత్రమే తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది కేవలం ఓ టేబుల్‌ స్పూన్‌ ఉప్పుతో సమానం. కానీ మనం ఒక్క పెరుగన్నంలోనే దీన్ని వాడేస్తాం. కాబట్టి మనమంతా కచ్చితంగా ఓ రోజులో మోతాదు కంటే ఎక్కువ ఉప్పును వినియోగిస్తున్నాం.

ఎండాకాలంలో..

ఉప్పు అడ్రినల్‌ గ్రంధులను ఉత్తేజ పరుస్తుంది. దీంతో వడదెబ్బకు గురైన వారికి ఉప్పు మేలు చేస్తుంది. ఉప్పు శరీరంలోని మినరల్స్‌ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువగా ఉప్పు తీసుకుంటే దాని ప్రభావం వెంటనే కనిపించక పోవచ్చు కానీ క్రమేపి తీవ్రమైన సమస్యలకు గురవుతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  Hair Fall in Teenagers: టీనేజ్‌‌ లో హెయిర్‌ ఫాల్‌కు కారణాలు ఇవే..!