Weight Loss: డైట్ ఫాలో అయినా బరువు తగ్గట్లేదా..? ఇది కారణం..!!

నేటి కాలంలో పదిమందిలో నలుగురు అధిక బరువతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 08:00 AM IST

నేటి కాలంలో పదిమందిలో నలుగురు అధిక బరువతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. జంక్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. ఇంట్లో తయారు చేసిన భోజనమే తినాలి. ఇవి వైద్యులు చెప్పే మాట. అయితే కొంతమంది ఎన్ని పద్దతులు అనుసరించినప్పటికీ బరువు మాత్రం తగ్గరు. బరువు తగ్గకపోవడానికి ఎలాంటి అంశాలు దోహదం చేస్తాయో వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు . ప్రొటీన్, విటమిన్ డి లేని ఆహారమే కారణమంటున్నారు నిపుణులు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

1. ఒత్తిడి చాలా పెద్ద అనార్థాలకు దారి తీస్తుంది. ఎవరైనా ఒత్తిడికి లోనయైతే…ఆ ప్రభావాం శరీరంపైన్నే చూపుతుంది. ఒత్తిడి, డిప్రేషన్, వర్రీ లాంటి మానసిక అనారోగ్యాలు అధిక బరువుకు కారణం అవుతాయి. బరువు తగ్గే ప్రయత్నాలకు కూడా ఇవి ఆటంకంగా మారుతాయి. అందుకే సరైన ఆహారం తీసుకున్నా…వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు పెరుగుతూనే ఉంటారు. అంతేకాదు ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు శరీరం రిలీజ్ చేసే కార్టిసాల్ హార్మోన్ మూలంగా అవాంఛిత బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.

2. బరువు పెరగడం అనేది హైపోథైరాయిడిజంకు సంకేతం అయి ఉండవచ్చు. తక్కువ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఉండటం వల్ల ఏర్పడే ఈ రుగ్మత అండర్ యాక్టివ్ థైరాయిడ్ వల్ల సంభవిస్తుంది. దీంతో జీవక్రియ నెమ్మదించి..బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. ఇక థైరాయిడ్ ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసినట్లయితే…ఆకస్మాత్తుగా బరువు తగ్గుతారు. దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు.

3. తక్కువ నిద్ర అనేది కూడా బరువులో ఊహించని మార్పులకు కారణం అవుతుంది. అధిక నిద్ర, నిద్రలేమి కార్టిసాల్ అనే హార్మోన్ను విడుదలను ప్రభావితం చేస్తుంది. ఇది ఆకలిని నియంత్రించి..కొవ్వును నిల్వ చేస్తుంది. నిద్రతగినంత లేనప్పుడు తక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. రోజుకు 7 నుంచి 8గంటల నిద్ర అవసరం.

4. బరువు తగ్గడంలో కీలకమైంది ప్రొటీన్. ప్రొటీన్ తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవక్రియ నిర్వహణకు ఆకలిని అరికట్టేందుకు సాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను తొలగిస్తున్నప్పుడు కండరాలను బలంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. మన ఆహారంలో ప్రొటీన్ మొత్తాన్ని పెంచేందుకు స్మూతీస్ మంచి మార్గం. ప్రొటీన్ రిచ్ డైట్ అనేది అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గడంతో తోడ్పడుతుంది.

5. డీహైడ్రేషన్ కొవ్వును బర్న్ చేస్తుంది. నీటి వినియోగంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉండటంతోపాటు మనం తగినంత నీరు తీసుకోనప్పుడు శరీరం ఆకలి, డీహైడ్రేషన్ మధ్య తేడాను గుర్తించేందుకు కష్టపడుతుంది.

6. విటమిన్ డి లోపం వల్ల కూడా అధిక బరువుకు కారణం అవుతుంది. పలు అద్యయనాల ప్రకారం ఇది బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది. తగినంత విటమిన్ డి లభించకపోతే బరువు పెరుగతారు. బరువు తగ్గే ప్రయత్నాలు మాత్రం ఫలించకపోవచ్చు. అందుకే రోజువారి వ్యాయామంలోపాటుగా అదనంగా విటమిన్ డిని ఆహారంలో చేర్చుకోవాల్సిందే.

7. మోనోపాజ్ దశలోనూ స్త్రీలు అధికంగా బరువు పెరుగుతారు. అంతేకాదు వయస్సు, జీవనశైలి, జెనెటిక్, వేరియబుల్స్ కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతుంది.