Heart Attack: నిద్రలో గుండెపోటు వచ్చే ముప్పు.. బీ అలర్ట్..!

నిద్రిస్తుండగా గుండెపోటు (Heart Attack) వచ్చే ఛాన్స్ ఉంటుందా ? అనే దానిపై ఇప్పుడు హాట్ టాక్ నడుస్తోంది. అయితే దీనికి హృద్రోగ నిపుణులు "అవును" అని సమాధానం ఇస్తున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 10 శాతం మందికి ఈవిధమైన ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 4, 2023 / 12:30 PM IST

నిద్రిస్తుండగా గుండెపోటు (Heart Attack) వచ్చే ఛాన్స్ ఉంటుందా ? అనే దానిపై ఇప్పుడు హాట్ టాక్ నడుస్తోంది. అయితే దీనికి హృద్రోగ నిపుణులు “అవును” అని సమాధానం ఇస్తున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 10 శాతం మందికి ఈవిధమైన ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ టైంలో శరీరంలో ” కేట్ ఖోలమైన్” (catecholamine) అనే న్యూరో హార్మోన్ మోతాదు పెరిగిపోవడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు పెరుగుతుందన్నారు. ప్రధానంగా ముసలి వాళ్ళు, డయాబెటిక్స్, ఊబకాయం, హైపర్ టెన్షన్, అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (నిద్ర లేమి) ఉన్న వారికి నిద్రలో గుండె పోటు వచ్చే ముప్పు ఎక్కువని తెలిపారు. ఇంతకీ నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చేటందుకు గల కారణాలను ఇలా వివరిస్తున్నారు.

” గుండెలోని కరోనరీ ధమనుల్లో ప్లేక్ పేరుకుపోతుంది. ఈ ప్లేక్ పేరుకుపోయి ధమనుల్లో క్లాట్ ఏర్పడి.. రక్త ప్రసారానికి అంతరాయం కలిగిస్తుంది. హై బీపీ, డయాబెటిస్, స్మోకింగ్, కుటుంబంలోని వాళ్ల కు గతంలో గుండె జబ్బులు ఉంటే కూడా ఇలా జరుగుతుంటుంది.

“మనం నిద్రలో ఉన్నప్పుడు శరీరంలోని అన్ని కండరాలు రిలాక్స్ డ్ గా ఉంటాయి. మెడ, గొంతులోని కండరాలు కూడా రిలాక్స్ డ్ గానే ఉంటాయి. ఒకవేళ రోగుల మెడలో అదనపు టిష్యూ ఉంటే .. అది మీ ముక్కులోని శ్వాస మార్గంపై ఒక్కసారిగా ఒత్తిడిని పెంచి అది స్తంభించేలా చేసే ముప్పు ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు పని చేయడం ఆగుతుంది. ఫలితంగా నిద్రిస్తుండగా అకస్మాత్తుగా శ్వాస ఆడదు. దీంతో నిద్రలో ఉక్కిరిబిక్కిరి అవుతారు” అని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

” ప్రధానంగా క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా(నిద్ర లేమి) సమస్య ఉన్నవాళ్లకు ఈ ముప్పు ఎక్కువ. సాధారణంగా రాత్రిపూట ఎవరికైనా బీపీ తగ్గుతుంది. కానీ స్లీప్ ఆప్నియా ఉన్నవాళ్లను బీపీ తగ్గకపోవచ్చు. ఫలితంగా హై బీపీ ప్రాబ్లమ్ వస్తుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయి.. బీపీతో పాటు అడ్రినలిన్ హార్మోన్ మోతాదు కూడా పెరుగుతాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గుండె ఎంతో ట్రై చేస్తుంది. దీనివల్ల గుండె పై ఒత్తిడి పెరుగుతుంది. ఈక్రమంలోనే హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే ముప్పు పెరుగుతుంది” అని వైద్య నిపుణులు తెలిపారు.అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో కూడా దీనిపై కొన్ని రిసెర్చ్ రిపోర్ట్ లు పబ్లిష్ అయ్యాయి.

Also Read: Bottle Gourd Benefits: సొరకాయలతో ప్రయోజనాలతో పాటు.. ఆ సమస్యలకు కూడా చెక్?

ఊబకాయం, హైపర్ టెన్షన్, ,నిద్రలేమి ఉన్నవారికి

ఇక 10-15 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు చిన్న వయస్సులో కార్డియాక్ అరెస్ట్ , గుండెపోటు చాలా కామన్ అవుతున్నాయి.  18- 20 సంవత్సరాల వయస్సు వారిలో కూడా గుండెపోటులను మనం చూస్తున్నాం. హార్ట్ ఫెయిల్ అవుతున్న వారిలో స్లీప్ అప్నియా సమస్య తరచుగా కనిపిస్తోంది. హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్  కేసుల్లో 52 శాతం , రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్ కేసుల్లో 80 శాతం, ఊబకాయం కేసుల్లో 77 శాతం, వివిధ హృదయ సంబంధ వ్యాధులలో 50-60 శాతం కేసులతో సంబంధం కలిగి ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ఒకటి లేదా రెండు రోజులు తక్కువ నిద్రపోవడం వల్ల పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ రోజూ సరిగ్గా నిద్రపోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె ఆరోగ్యంపై నిద్ర ఎఫెక్ట్ ఉంటుంది.  అథెరోస్క్లెరోసిస్, రక్త నాళాల గోడలపై లిపిడ్లు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వంటి సమస్యలకు సరిగ్గా నిద్ర పోకపోవడంతో లింక్ ఉంటుంది.

ఈ జాగ్రత్తలు అవసరం

* కంటి నిండా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం చేయకపోవడం , అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను సరిగ్గా నిర్వహించడం వంటి  వాటి ద్వారా ఈ ముప్పు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

* సూర్యరశ్మి వల్ల మన శరీరంలో మెలటోనిన్‌ అనే హార్మోన్ తయారవుతుంది. ఇది మీ నిద్ర-మేల్కొనే చక్రాన్ని సక్రమంగా ఉంచడంలో సహాయపడే సహజ హార్మోన్ . సాధ్యమైనంత వరకు మనం కృత్రిమ కాంతికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పడుకునే ముందు గంటలలో లైట్ల వెలుతురుకు దూరంగా ఉండాలి.

* ఆల్కహాల్ , కొవ్వు లేదా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, కెఫిన్ లను రాత్రిపూట తీసుకోవద్దు. రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది.