Vastu Tips: పావురాలు ఇంట్లోకి వస్తే జరుగుతుందా లేక చెడు జరుగుతుందా.. శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే?

చాలామంది జంతు ప్రేమికుల లాగే పక్షుల ప్రేమికులు కూడా ఉంటారు. కొంతమంది పక్షులను ప్రేమగా ఇంట్లో

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 07:30 AM IST

చాలామంది జంతు ప్రేమికుల లాగే పక్షుల ప్రేమికులు కూడా ఉంటారు. కొంతమంది పక్షులను ప్రేమగా ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే పక్షులపై ప్రేమ ఉన్నవారు చాలామంది ఆ పక్షులు వదిలేసిన గూళ్లను తెచ్చుకొని ఇంటిలో అలంకరణగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మానవులు వారి అవసరాల కోసం చెట్లను నరికేస్తూ ఉండడంతో పక్షులు గూళ్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక పాడుబడ్డ ఇల్లు అలాగే పెద్ద పెద్ద ఇలలో బాల్కనీలో మరి కొన్ని పక్షులు ఇళ్లలో కూడా గూళ్లను పెట్టుకుంటూ ఉంటాయి. పావురాలు, పిచ్చుకలు ఇళ్లలో గూడు కట్టుకోవడం మనం చూస్తుంటాం. అయితే కొంతమంది అలా పెట్టుకున్న కూడా ఏమీ అనరు.

మరి కొందరి మాత్రం అలా వస్తే ఇంట్లోకి ఆ శుభమని భావిస్తూ వాటిని తరిమికొడుతూ ఉంటారు. అయితే ఇంట్లోకి పావురం వచ్చి గూడు కట్టుకోవడం అంటే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుందట. మరి ముఖ్యంగా ఇంట్లోకి పావురాలు వస్తున్నాయి అంటే అది ఆనందం శాంతి రాకకు చిహ్నం అని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ పక్షులకు ఆహారం ఇస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. కానీ పావురాలకు మాత్రం ఇంటిపై కప్పు ప్రాంతంలో గింజలు వేయకూడదు. ఇంటి ముందర ప్రాంగణంలో గింజలు వేస్తేనే మంచి జరుగుతుంది.

అలాగే చాలామందికి జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు అటువంటివారు పావురాలకు ఆహారం ఇవ్వాలి. పావురాలకు గింజలు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. తద్వారా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. రావాల్సిన డబ్బులు కూడా చేతికి చెందుతాయి. అలాగే పక్షులు ఇంట్లో గూడు కట్టుకోవడం వల్ల వాస్తు దోష వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది ఇంట్లో పావురాలు గూడు కడితే అరిష్టమని చెబుతూ ఉంటారు. కానీ అందులో నిజం లేదని వాస్తు, జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలా పావురాలు ఇంట్లోకీ రావడం అన్నది ఆ ఇంట్లో నివసించే వారికి అదృష్టం పెరుగుతుందట.