Site icon HashtagU Telugu

Ugadi: కశ్మీరీ పండిట్ల ఉగాది “నవ్రే” విశేషాలు ఇవీ..

These Are The Features Of Ugadi Navre Of Kashmiri Pandits...

These Are The Features Of Ugadi Navre Of Kashmiri Pandits...

ఉగాది (Ugadi) పండుగను దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో నిర్వహించుకుంటారు. చైత్ర (మార్చి-ఏప్రిల్) మాసం మొదటి రోజున జమ్మూ కాశ్మీర్ అంతటా “నవ్రే” పేరుతో ఉగాదిని సెల బ్రేట్ చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు తమను కలిసే ప్రతి ఒక్కరికీ ఆప్యాయంగా ‘నవ్రే ముబారక్’ (నూతన సంవత్సర శుభాకాంక్షల)తో పలకరిస్తారు. నవ్రేహ్ అనేది సంస్కృత పదం ‘నవ-వర్ష’ నుంచి వచ్చింది. దీని అర్థం నూతన సంవత్సరం.

సప్తర్షులు, శారికా దేవతను దర్శించుకున్న రోజు..

కాశ్మీరీ హిందూ క్యాలెండర్ ప్రకారం.. సప్తర్షి యుగం దాదాపు 5079 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రారంభమైందని నమ్ముతారు. శారికా దేవతను దుర్గా దేవి రూపంగా భావిస్తారు.  సుమారు 5000 సంవత్సరాల క్రితం నవ్రే రోజున సప్తర్షులు ఆమెను దర్శించుకోవడానికి కాశ్మీర్ లోని శారికా పర్వతం పైకి వచ్చారని నమ్ముతారు.ఈ పర్వతం మీద హరి పర్భాత్ మందిరం ఉంది. ఉగాది రోజున ఈ టెంపుల్ కు వెళ్లి శారికా దేవతకు పూజలు చేస్తారు.

పూజ కోసం ఒక ప్లేట్ నిండా..

ఈ పూజ కోసం ఒక ప్లేట్ నిండా పొట్టు తీయని అన్నం, రొట్టె, ఒక చిన్న గిన్నెలో పెరుగు, ఉప్పు, పంచదార మిఠాయి, కొన్ని వాల్‌నట్‌లు లేదా బాదంపప్పులు, వెండి నాణెం, రూ. 10 నోటు, పెన్ను, అద్దం వంటి వాటిని సిద్ధం చేసే ఆచారం ఉంది. కొన్ని పువ్వులు, కాశ్మీరీ పంచాంగ పుస్తకం ఉంచుకుని పూజలు చేస్తారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇవన్నీ రాత్రిపూట సిద్ధం చేసి పెడతారు. ఉదయం లేవగానే ఈ ప్లేట్‌ను చూసి రోజును ప్రారంభిస్తారు.

గుడి పడ్వా

గుఢి ధ్వజ అంటే.. పువ్వులు, మామిడి ఆకులు, వేప ఆకులతో అలంకరించబడిన  వస్త్రం. ప్రజలు తమ ఇంటి తలుపు లేదా కిటికీ వెలుపల గుడిధ్వజను ఉంచడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తారు. అందుకే ఉగాదికి మహారాష్ట్ర, కర్ణాటకలలో ఈ పేరు వచ్చింది. ఈసందర్భంగా ప్రజలు తమ ఇంటి గడపలను రంగోలీ, మామిడి ఆకులతో చేసిన తోరణంతో అలంకరిస్తారు.తలుపు లేదా కిటికీ వెలుపల గుడిధ్వజను ఉంచిన తర్వాత ప్రార్థనలు చేసి, పువ్వులు సమర్పిస్తారు. అనంతరం హారతి ఇచ్చి అక్షతలను గుడి ధ్వజపై వేస్తారు.

Also Read:  Ugadi: ఉగాది వస్తోంది.. ఈసారి ఎన్ని మాసాలు? శుభ ముహూర్తం ఏమిటి?