Gold Laddu : గణపయ్య చేతిలో ‘బంగారు లడ్డు’..చూసేందుకు వస్తున్న భక్తులు

నారాయణగూడ లో మాత్రం గణపతి చేతిలో బంగారం లడ్డు పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

  • Written By:
  • Updated On - September 23, 2023 / 03:42 PM IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు (Ganesh Chaturthi) అంబరాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో అయితే చెప్పాల్సిన పనేలేదు. గల్లీకో పది చొప్పున గణపయ్య లు దర్శనం ఇస్తున్నారు. గణపతి మాత్రమే కాదు ఆయన చేతిలోఉన్న లడ్డు కూడా ఎంతో మహిమ కలది. అందుకే లక్షలు పెట్టి వేలంలో గణపతి లడ్డు ను దక్కించుకుంటుంటారు. బాలాపూర్ లడ్డు కు ఎంతో ప్రాముఖ్యత కలదు..అందుకే ఇక్కడ లడ్డును లక్షలు పెట్టి దక్కించుకుందుకు పోటీపడతారు. మాములుగా అయితే గణపతి చేతిలో లడ్డు అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. కానీ నారాయణగూడ (Narayanaguda ) లో మాత్రం గణపతి చేతిలో బంగారం లడ్డు (Gold Laddu) పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

Read Also : Hero Nani: నేను స్కూలింగ్ లో ఉండగానే ప్రేమలో పడ్డాను: హీరో నాని

నారాయణగూడ స్ట్రీట్ నెం.5లో జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ (Jai Sree Ganesh Youth Association) ఆధ్వర్యంలో ఏటా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గణనాథుడికి మండపం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అయితే ఈసారి కాస్త భిన్నంగా గణపయ్య చేతిలో బంగారు లడ్డూ పెట్టారు. తులం బంగారంతో ప్రత్యేక లడ్డూ (10 Gm Gold Laddu ) తయారు చేసి గణనాథుని చేతిలో ఉంచారు. ఈ బంగారు లడ్డూ విలువ రూ.60 వేలకు పైగా ఉందట. ఈ లడ్డు ను చూసేందుకు భక్తులు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో వస్తున్నారట. ఉత్సవాల చివరి రోజు గణపతి చేతిలోని 15 కిలోల లడ్డూలతో పాటు ఈ బంగారు లడ్డూలను వేలం వేయనున్నట్ల మండపం నిర్వాహకులు చెపుతున్నారు.