Minister Malla Reddy Dance: డీజే టిల్లు కాదు.. డీజే మల్లారెడ్డి.. డ్యాన్స్ అదరగొట్టిన మంత్రి..!

బీఆర్ఎస్ లో మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా తన టాలెంట్‌ని బయటపెట్టి అందరినీ అలరిస్తున్నాడు. తాజాగా డీజే టిల్లుగా మారాడు.

  • Written By:
  • Updated On - January 12, 2023 / 11:04 AM IST

బీఆర్ఎస్ లో మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా తన టాలెంట్‌ని బయటపెట్టి అందరినీ అలరిస్తున్నాడు. తాజాగా డీజే టిల్లుగా మారాడు. కుత్బుల్లాపూర్ మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గాలిపటాల పండుగ, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతే కాదు ఈ కార్యక్రమంలో హీరో సిద్ధు, దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు బాబీ, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో డీజే టిల్లు సినిమాలోని మాస్ సాంగ్ అయిన డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు హీరో సిద్ధూతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. డీజే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డితో కలిసి హీరో సిద్ధూ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు. వేదికపై మంత్రి మనవడు కూడా డ్యాన్స్ చేశాడు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థుల కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసం చేకూర్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్యలోని ఓ పాటను దేవిశ్రీప్రసాద్, శేఖర్ మాస్టర్, దర్శకుడు బాబీతో కలిసి మంత్రి విడుదల చేశారు. మంత్రి మల్లారెడ్డి, హీరో సిద్ధూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది.