Modi Effect On YSRCP : మోడీ అలా చేస్తే వైసీపీకి ఎఫెక్టే!

ప్రాంతీయ పార్టీల హ‌వా జాతీయ స్థాయిలో క్రమంగా త‌గ్గిపోతోంది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ దెబ్బ‌కు జాతీయ పార్టీ హోదాను క‌మ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంది.

  • Written By:
  • Updated On - June 25, 2022 / 05:49 PM IST

ప్రాంతీయ పార్టీల హ‌వా జాతీయ స్థాయిలో క్రమంగా త‌గ్గిపోతోంది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ దెబ్బ‌కు జాతీయ పార్టీ హోదాను క‌మ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ త‌రువాత ఆ స్థాయికి ఏ ప్రాంతీయ పార్టీ ఎద‌గ‌లేదు. అంతేకాదు, ఎదిగే అవ‌కాశం కూడా ప్ర‌స్తుతం క‌నిపించ‌డంలేదు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏ పార్టీకి ఢిల్లీ చ‌క్రం తిప్పేలా ఎంపీల సంఖ్య ఉండే ఛాన్స్ లేదు.

ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్ ఇద్ద‌రూ భిన్నంగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల విష‌యంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్డీయే అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు సంపూర్ణ మ‌ద్ధ‌తును జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. జాతీయ ప్ర‌త్యామ్నాయం అంటోన్ కేసీఆర్ విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా వైపు ఉన్నారు. ఈ ప‌రిణామం జాతీయ రాజకీయ వేదికపై ప్రాంతీయ పార్టీలు పోషించగల పరిమిత పాత్రలను మరోసారి బహిర్గతం చేసేలా వాళ్లిద్ద‌రూ న‌డిచారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే 1 టైంలో ప్ర‌క‌టించిన రాష్ట్రపతి అభ్యర్థికి 2017లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బేషరతు మద్దతును అందించారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడుతున్నారనే విమర్శలను ఆనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్టుబట్టలేదో తెలిపాల‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

సీఎం పదవిలో ఉన్న మొదటి రోజు నుండి మా రాజకీయాలలో (కేంద్రానికి సంబంధించి) మాకు స్పష్టత ఉంది అని జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు చెబుతున్నారు. మోడీ-షా ద్వయం నుండి కొన్ని సానుకూల అంశాల‌ను సాధించిన‌ట్టు చెబుతున్నారు. “ప్రత్యేక హోదా అనేది ముగిసిన‌ అధ్యాయమని అందరికీ తెలుసు. బదులుగా, అదనపు గ్రాంట్లు , రుణాలు పొందడానికి పరపతిని ఉపయోగిస్తున్నాము, ”అని వైసీపీలోని ఒక కీల‌క వ్య‌క్తి స‌మాచారం ఇచ్చారు.

1989, 1996 మరియు 1999లో మూడుసార్లు జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. ఆనాడు ఆ పార్టీ చెప్పిన‌ట్టే జాతీయ రాజ‌కీయాలు న‌డిచాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, BJP ల‌కు 300 కంటే తక్కువ సీట్లు ఉండటం ఆనాడు టీడీపీ కీల‌క. పాత్ర పోషించ‌డానికి అవ‌కాశం ల‌భించింది. 2022 నాటికి రాజ‌కీయ ప‌రిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు BJP 300-ప్లస్ సీట్లను కలిగి ఉంది. అంతేకాదు, కొత్తగా రాష్ట్రాల‌ను జయించటానికి సిద్ధంగా ఉంది.

“2004లో జాతీయ పార్టీల పతనాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఆ ప‌రిణామాన్ని 2014లో మోడీ (ట్రెండ్) కొత్త స్థాయికి తీసుకెళ్లారు. BJP జాతీయవాద కథనం, మోడీ పాన్-ఇండియా ఇమేజ్ చెక్కుచెదరకుండా ఉండటంతో ప్రాంతీయ పార్టీల పాత్ర మరింత క్షీణిస్తుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా దక్షిణాదిన తెలంగాణ వంటి ప్రాంతాలకు బిజెపి విస్తరణకు దూకుడు పెంచింది. ఫ‌లితంగా ప్రాంతీయ పార్టీల‌ను మరింత బలహీనప‌డే అవ‌కాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్లను సాధించిన బిజెపి, అసెంబ్లీలో 37 శాతం వద్ద నిలబ‌డింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సాధించిన 20 శాతం ఓట్లను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది. మోదీ ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడంలో విజయం సాధించినట్లయితే, వైయస్ఆర్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలపై ప్రతికూల ప్రభావం మరింత ఎక్కువగా ఉండేది.

జాతీయ స్థాయిలో ముంద‌స్తు ఎన్నిక‌ల దిశ‌గా వెళితే, ప్రాంతీయ పార్టీల హ‌వా మ‌రింత త‌గ్గిపోయే అవ‌కాశం లేక‌పోలేదు. లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హిస్తే జాతీయ‌తావాదం జాతీయ పార్టీల‌కు క‌లిసొచ్చే అంశం. అందుకే, బీజేపీ ఆ దిశ‌గా ఆలోచిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను మార్చుతోంది.