ఏపీ ఆర్థికంపై కేంద్రం నిఘా ..960కోట్ల విదేశీ రుణాల మ‌త‌లబు

ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వేత‌ర ఆర్థిక సంస్థ‌లు చెబుతున్నాయి. ఖ‌జానాకు వ‌చ్చిన నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సంక్షేమ ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేస్తోంది. కానీ, వివిధ ప‌థ‌కాల కోసం విదేశాల నుంచి తీసుకున్న రుణాల‌ను ఆ ప‌థ‌కాలకు మాత్ర‌మే ఖ‌ర్చు చేయాలి

  • Written By:
  • Publish Date - September 20, 2021 / 02:40 PM IST

ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వేత‌ర ఆర్థిక సంస్థ‌లు చెబుతున్నాయి. ఖ‌జానాకు వ‌చ్చిన నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సంక్షేమ ప‌థ‌కాల‌కు ఖ‌ర్చు చేస్తోంది. కానీ, వివిధ ప‌థ‌కాల కోసం విదేశాల నుంచి తీసుకున్న రుణాల‌ను ఆ ప‌థ‌కాలకు మాత్ర‌మే ఖ‌ర్చు చేయాలి. అందుకు విరుద్ధంగా విదేశీ సంస్థ‌ల నుంచి తీసుకున్న రుణాల‌ను కూడా సంక్షేమానికి ఏపీ స‌ర్కార్ వాడింది. ఆ విష‌యాన్ని తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ వివ‌రాల‌ను అడిగింది. సుమారు 960 కోట్ల రూపాయాలను ప‌క్క‌దోవ పట్టించిన వైనంపై రాత పూర్వ‌క వివ‌ర‌ణ కావాల‌ని కేంద్రం ఆదేశించింది. అందుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ స‌ర్కార్ నుంచి వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంపై కేంద్రం అస‌హ‌నంగా ఉంది.

ఈఏపీ ప్రాజెక్టుల కోసం విదేశీ రుణాల‌ను ఎంత తీసుకున్నారు? ఎక్క‌డ తీసుకున్నారు? ఎంత వ‌డ్డీ చెల్లించాల‌ని కండిష‌న్ ఉంది? త‌దిత‌ర అంశాల‌పై రాత‌పూర్వ వివ‌ర‌ణ కావాల‌ని ఏపీ ఆర్థిక శాఖ‌ను కేంద్రం అడిగింది. వివిధ ప్రాజెక్టుల‌కు తీసుకున్న 960 కోట్ల‌లో దేనికి ఎంత డ్రా చేశారో తెలియ‌చేయాల‌ని కోరింది. ఈఏపీ ప్రాజెక్టు ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌కు ఇంకా బిల్లులు చెల్లించాలి. ఆయా ప్రాజెక్టులు అస‌మ‌గ్రంగా ఉన్నాయ‌ని గుర్తు చేసింది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ విదేశీ రుణాల కోసం ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని, ఒక వేళ చేసిన కేంద్రం క్లియెరెన్స్ ఇవ్వ‌ద‌ని బ‌ల్ల‌గుద్ది చెప్పింది. కేంద్ర మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం ఆ మేర‌కు ఏపీ ఆర్థిక‌శాఖ‌కు హుకుం జారీ చేసింది.

యుటిలైజేష‌న్ అడ్వాన్స్ ల‌ను ఇక ఇవ్వ‌రాద‌ని తేల్చి చెప్పింది. సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు అడ్వాన్స్ ల రూపంలో ఇచ్చిన 960 కోట్ల కు సంబంధించిన లెక్క‌లు చెప్పాల‌ని ఆదేశించింది. ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే, ఏపీ ప్ర‌భుత్వం ఇక నుంచి ప్ర‌తి పైసాకు లెక్క చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సో..ఇక నిధులు మంజూరు అయ్యే అవ‌కాశం లేదు. నిధుల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించే ఛాన్స్ లేదు. ఫ‌లితంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను వీలున్నంత త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయ‌డం మాత్ర‌మే ఏపీ స‌ర్కార్ ప‌రిధిలోని అంశం. అందుకే ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తోంది.
మొత్తం మీద కేంద్రం ఇచ్చిన తాఖీదుల‌కు ఏపీ స‌ర్కార్ ఎలాంటి స‌మాధానం ఇస్తుందోన‌ని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. విదేశీ రుణాల‌కు త‌లుపుల‌ను కేంద్రం మూసివేయ‌డంతో ఏపీ స‌ర్కార్ ప్ర‌త్యామ్నాయం కోసం అన్వేషిణ ప్రారంభించింది. అది ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.