BC Quota : ప్ర‌వేట్ యూనివ‌ర్సిటీల్లో బీసీల‌కు 35 శాతం కోటా

ఏపీ ప్ర‌భుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారికి అన్ని విధాలుగా ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంది.

  • Written By:
  • Publish Date - November 25, 2021 / 04:14 PM IST

ఏపీ ప్ర‌భుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారికి అన్ని విధాలుగా ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంది. ఇప్ప‌టికే రాజ్యాంగ ప‌ద‌వుల్లో బీసీల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేట్ యూనివ‌ర్సిటీల్లో 35 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో బీసీలకు 35% కోటా కల్పించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యార్థులకు ప్రభుత్వ కోటా కింద ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించేందుకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన మరియు నియంత్రణ) (సవరణ) బిల్లు, 2021ని రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదించింది. ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు 35 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని ఆయ‌న తెలిపారు.