Bandla Ganesh: బండ్ల ట్వీట్.. విజయసాయి అంతకంటే డేంజర్!

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన బండ్ల.. వైజాగ్ ని కుదిపేసిన తుపాను కేవలం రెండు రోజులు ఊపేసి పోయిందని, విజయసాయి అంతకంటే డేంజర్ అని పేర్కొన్నారు. దేశం గర్వించే సిటీని విష సాయి పాపాలతో అయ్యో పాపం విశాఖ గా మార్చారని విమర్శించారు. అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్బాజీ విజయసాయి అని తెలిపిన బండ్ల… విజయసాయిని జగన్ కట్ చెయ్యడం ఖాయమని, ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయమని తెలిపారు.

మేము కష్టాన్ని నమ్ముకున్న రైతులమని, కానీ విజయసాయి విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నావని, ఇది ప్రపంచానికి తెలుసని తెలిపిన బండ్ల పవన్ కల్యాణ్ అంటే తనకి ఇష్టమని, అలాగే ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా ఇష్టమని తెలిపారు. పచ్చని కాపురంలో విజయసాయి చిచ్చు పెట్టాలనుకుంటున్నాడని, అది మంచిది కాదని, టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారికి టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. జగన్ ఇలాంటి వారిని దగ్గర పెట్టుకోని, రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని, తనకి కుల పిచ్చి లేదని, తన కులాన్ని తాను ప్రేమిస్తానని, అయితే ప్రతి కులాన్ని గౌరవిస్తానని అన్నారు. కమ్మ వారిని తిట్టడాన్ని తట్టుకోలేక పోతున్నానని, విజయసాయి కి నచ్చని వారిని పేరు పెట్టి తిట్టాలని , దయచేసి కులాన్ని తిట్టవద్దని విజ్ఞప్తి చేసిన బండ్ల విజయసాయి బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసన్నారు.

విజయసాయిని జైలుకు పంపింది కమ్మ వారు కాదని, త్వరలో జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడు విజయసాయని పేర్కొన్న బండ్ల ఈ ట్వీట్ తరువాత విజయసాయి తనని ఎంత ఇబ్బంది పెడతాడో తెలుసని, అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నానని తెలిపిన బండ్ల వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారని హెచ్చరించారు. తనకి వైయస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవమని, కానీ విజయసాయి రాష్ట్రానికి పట్టిన దరిద్రమని తెలిపారు. అన్ని కులాల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారని, కులాన్ని బలిచేయ్యాలని చూస్తే తనకి చరిత్ర తిరిగి చర్లపల్లి చూపిస్తుందని బండ్ల తెలిపారు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదని, తాను కమ్మవాడినేనని, కానీ టీడీపీ కాదని విజయసాయిపై బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు.